ETV Bharat / city

ఒకే ట్రాక్​పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ప్రమాదం లేదు.. ఎందుకంటే? - Kavach system inspection by union minister

Kavach system Trial run by Ashwini Vaishnav: ఒకే ట్రాక్​పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే.. జరిగే ప్రమాదం ఊహించుకోవడం చాలా కష్టం. ఇక ముందు అలాంటి ప్రమాదాలేవీ జరగవు. లోకో పైలట్​ అప్రమత్తంగా లేకపోయినా, ట్రాక్​ సరిగా లేకపోయినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఇక భయపడనవసరం లేదు. ఎందుకంటే దానికి పరిష్కారం 'కవచ్' రూపంలో దొరికింది. ఈ కవచ్​ టెక్నాలజీ.. ప్రయోగాత్మకంగా చేపట్టిన పరీక్షలోనూ మంచి ఫలితాలనిచ్చింది. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్​ జిల్లా నవాబ్​పేట్​లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'కవచ్​' ట్రయల్​రన్​ విజయవంతమైంది.

Kavach System in telangana
ట్రయల్​ రన్​ నిర్వహించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​,
author img

By

Published : Mar 4, 2022, 9:04 PM IST

Kavach system Trial run by Ashwini Vaishnav: తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేటలో ఏర్పాటు చేసిన 'కవచ్‌' వ్యవస్థ పనితీరు కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పాల్గొన్నారు. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా అత్యంత సమీపానికి వచ్చి ఆగిపోతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రయల్‌ రన్‌లో ఆయన పాల్గొన్నారు. ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా దేశీయ పరిజ్ఞానంతో ఈ టెక్నాలజీని కనుగొన్నారు. నవాబ్​పేట మండలం చిట్టిగిద్ద, గొల్లగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ట్రయల్​ రన్​ నిర్వహించారు. ఎదురెదురుగా రైళ్లు వచ్చిన సమయంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేసిన లోకో మోటివ్ ఇంటర్ లాకింగ్ సిస్టంను ఆయన పరిశీలించారు.

ట్రయల్​ రన్​ నిర్వహించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​,

ఆటోమేటిక్​గా బ్రేకులు..
ఈ కవచ్‌ వ్యవస్థతో రైళ్లకు ఆటోమేటిక్​గా బ్రేకులు పడతాయని కేంద్రమంత్రి వివరించారు. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా వచ్చినప్పుడు గుర్తించి ఇది ఆపుతుందని చెప్పారు. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలు నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుందని కేంద్రమంత్రి వెల్లడించారు. ట్రయల్​ రన్​ అనంతరం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మేధ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అశ్వినీ వైష్ణవ్‌ ప్రారంభించారు.

స్పందిస్తుంది

"ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా కవచ్​ టెక్నాలజీ ద్వారా అత్యంత సమీపానికి వచ్చి ఆగిపోతాయి. ఈ వ్యవస్థతో రైళ్లకు ఆటోమేటిక్​గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా వచ్చినప్పుడు గుర్తించి ఇది ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలు నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది." -అశ్వినీ వైష్ణవ్​, కేంద్ర రైల్వే శాఖ మంత్రి

  • आत्मनिर्भर भारत की मिसाल- भारत में बनी 'कवच' टेक्नोलॉजी।
    Successfully tested head-on collision. #BharatKaKavach pic.twitter.com/w66hMw4d5u

    — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 4, 2022
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందుగా శంషాబాద్​ విమానాశ్రయంలో ఎంపీలు రంజిత్​ రెడ్డి, ధర్మపురి అర్వింద్​.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​కి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉందానగర్ రైల్వే స్టేషన్​కు ఆయన చేరుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. వికారాబాద్ రైల్వే సమస్యలపై ఎమ్మెల్యే ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణయ్​కు వినతి పత్రాలు సమర్పించారు.

ఇదీ చదవండి: gajendra: పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి - కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.