ETV Bharat / city

ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందే: కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ -

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్తు చట్ట సవరణ బిల్లు వల్ల రైతులకు ఎలాంటి నష్టమూ ఉండదని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కేసింగ్ స్పష్టం చేశారు. బిల్లులో రైతుకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా లేదన్నారు. బాధ్యతలేని రాజకీయ నాయకులంతా అధికారంలోకి రావడానికి ఉచితాలు ప్రకటిస్తుంటారన్న ఆయన, ఆయా ప్రభుత్వాలపై ప్రజలే చర్యలు తీసుకోవాలన్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 12,970 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు.

RK Singh
RK Singh
author img

By

Published : Sep 10, 2022, 12:36 PM IST

విద్యుత్ సవరణ చట్టంలో రైతు వ్యతిరేక పదం ఒక్కటి కూడా లేదని.... కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్ తేల్చిచెప్పారు. వ్యవసాయ విద్యుత్ విషయంలో ఎన్ని రాయితీలయినా ఇచ్చుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందన్న కేసీఆర్ మాట పూర్తిగా అవాస్తవమని చెప్పారు. అలాగే ఏపీకి తెలంగాణ విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 12 వేల 970 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వుల ప్రకారం సరఫరా చేసిన విద్యుత్ అంశమే తమ పరిధిలోకి వస్తుందన్నారు. విభజన జరిగిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయమని .. ఏపీ ప్రభుత్వానికి చెప్పిందని.. అందువల్ల దానికి సంబంధించిన ఛార్జీలను చెల్లించమని.. తెలంగాణను ఆదేశించే న్యాయపరిధి... విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కేంద్రానికి ఉందన్నారు. తెలంగాణ తప్పకుండా విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇవి చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.