వ్యవసాయ చట్ట సవరణలు చేసి వాటిని వివరించేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు ఇవాళ్టివి కావని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఈ మూడు సవరణలు చేశామని పేర్కొన్నారు. రైతులకు ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశ్యం దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవస్ధ వేరేగా ఉందన్నారు. ప్రైవేటు గాను వ్యవసాయ ఉత్పత్తులు సేకరణ ఇక్కడ జరుగుతోందని వివరించారు.
విమానాశ్రయం నుంచి వస్తూ కరివేపాకు రైతులను కలిశామని కేంద్రమంత్రి చెప్పారు. పన్నుల కోసం 10 వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చేదని... కొత్త చట్టం వల్ల ఇక అది ఉండదని స్పష్టం చేశారు. ప్రతి చోటా, ప్రతి రాష్ట్రంలో పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. యార్డు పన్ను, దళారీలకు ఇలా వేర్వేరు పన్నులు చెల్లించాల్సిన పని ఇక లేదని చెబుతున్నామని వివరించారు.
యార్డుకు వెలుపల జరిగే లావాదేవీలపైనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని నిర్మలా స్పష్టం చేశారు. యార్డు బయట, రాష్ట్రం బయట జరిగే లావాదేవీలకు పన్ను లేదని చెప్పారు. కనీస మద్దతు ధర ఇప్పటి వరకు వరి, గోధుమకు మాత్రం లభించేది. 22 ఉత్పత్తులు ఉన్నా... వాటికి ఎప్పుడూ ధర దక్కలేదు. అందుకే చాలా పంటలు సాగు చేయడం తగ్గిపోయిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
టమాటా పండించే రైతుల గిట్టుబాటు ధర రాకపోతే వాటిని రోడ్దుపైనే పడేసిన ఉదాహరణలు ఉన్నాయి. త్వరగా పాడయ్యే వ్యవసాయ ఉత్పత్తులు కాంట్రాక్టు ప్రాతిపదికన ఒప్పందం జరిగితే రైతులకు లాభమే కదా. ఈ ఒప్పందంలో స్థానిక యంత్రాంగం కూడా భాగస్వామ్యం అవుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి ఉత్పత్తి నిల్వ చేసినా సోదాలు జరిగేవి. అందుకే దీన్ని నిత్యవసర చట్టం పరిధిలోకి తీసుకువచ్చాము. - నిర్మలా సీతారామన్
ఇదీ చదవండి: