ETV Bharat / city

ప్రాణాలు పైప్​లైన్లలో! - ఏపీ ఆక్సిజన్ ఇబ్బందులు

ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తుతున్న సాంకేతిక, పర్యవేక్షణ సమస్యలతో పాటు అధికారుల బాధ్యతారాహిత్యం పలువురి ప్రాణాలు తీస్తోంది. ఆక్సిజన్‌ పైపులైన్లను తనిఖీ(ఆడిటింగ్‌) చేసినట్లు అధికారులు చెబుతున్నా... ఇటీవల జరిగిన పలు సంఘటనలు నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. అనంతపురం క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు శ్వాస పీల్చుకోవడంలో సమస్యలొచ్చి ప్రాణాలు విడిచారు.

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థపై అనూహ్య ఒత్తిడి

author img

By

Published : May 6, 2021, 8:21 AM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరాలో తలెత్తుతున్న సాంకేతిక, పర్యవేక్షణ సమస్యలతోపాటు అధికారుల బాధ్యతారాహిత్యం పలువురి ప్రాణాలు తీస్తోంది. కొవిడ్‌ బాధితులకు పైపులైన్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు పీడనాన్ని(ప్రెషర్‌)పెంచుతుండగా అందుకు అనుగుణంగా పైపులైన్ల సామర్థ్యం ఉండడంలేదు. అనూహ్యంగా కేసులు పెరుగుతుండడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ, కాకినాడ, విజయవాడ జీజీహెచ్‌ లాంటిచోట్ల చిన్నచిన్న సమస్యలు తలెత్తగా అధికారులు వెంటనే అప్రమత్తమై పరిస్థితులు చక్కదిద్దారు. ఆక్సిజన్‌ పైపులైన్లను తనిఖీ(ఆడిటింగ్‌) చేసినట్లు అధికారులు చెబుతున్నా... ఇటీవల జరిగిన పలు సంఘటనలు నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. అనంతపురం క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు శ్వాస పీల్చుకోవడంలో సమస్యలొచ్చి ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో లైసెన్సును ఎందుకు రద్దుచేయకూడదో వివరణ ఇవ్వాలని ‘వారాసి’ సంస్థకు, ఆసుపత్రి ఇంఛార్జి వైద్యుడు కె.భాస్కర్‌కు జిల్లా కలెక్టర్‌ సంజాయిషీ నోటీసు జారీ చేయడం ఇందుకు నిదర్శనం.
పలుచోట్ల సమస్యలు..
* అనంతపురంలోని సర్వజన ఆసుపత్రి, క్యాన్సర్‌ ఆసుపత్రి, హిందూపురం ఆసుపత్రిలో వరుసగా ఆక్సిజన్‌ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. సర్వజనాసుపత్రిలో ఈనెల 1న ఆక్సిజన్‌ సరఫరాలో లోపాలు తలెత్తి మరణాలు సంభవించడం వెనుక పైపులైన్ల పనితీరు సక్రమంగా లేకపోవడమేనని చెబుతున్నారు. ట్యాంక్‌ దగ్గర ప్రెషర్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం తక్కువగా ఉన్నందున సరఫరా జరగక... రోగులు మరణించారని చెబుతున్నారు. పీడనం (ప్రెషర్‌) సమస్యలు ఉన్నాయని సర్వజనాసుపత్రిలో పనిచేసే మత్తుమందు వైద్యులు ఇటీవల అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
* హిందూపురంలోని జిల్లా ఆసుపత్రి, క్యాన్సర్‌ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ ట్యాంకులు రావడంలో కాస్త ఆలస్యం కావడంతో బాధితుల్లో పలువురు ప్రాణాలు విడిచారు. ఆక్సిజన్‌ సరఫరా తీరును పర్యవేక్షించాల్సిన మత్తుమందు వైద్యులు సర్వజనాసుపత్రిలో తక్కువగా ఉండడం కూడా సమస్యగా మారింది.
* ఏప్రిల్‌ 26న విజయనగరంలోని మహారాజా కేంద్ర ఆసుపత్రిలో రాత్రి 2-2.30 గంటల మధ్య ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయంగా సిలిండర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు. ఆసుపత్రి ఆవరణలో 2 కేఎల్‌ సామర్థ్యమున్న ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఉన్నాయి. వీటి నుంచి 120 మందికి ప్రాణవాయువు అందించవచ్చు. ఆ రోజు 200 మందికి వినియోగించడంతో ఒత్తిడి పెరిగి పైపులైను లీకై సరఫరాలో లోపం తలెత్తింది.
* విజయవాడ జీజీహెచ్‌లోని ఆక్సిజన్‌ ట్యాంకుల్లో ఒకదాని వద్ద 3రోజుల క్రితం వాల్వు దగ్గర బిగుసుకు పోవడంతో ఆక్సిజన్‌ సరఫరాకు కొంత ఇబ్బంది ఏర్పడింది. ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాను పర్యవేక్షించేందుకు సిబ్బంది తక్కువగా ఉన్నారు.
* విశాఖ కేజీహెచ్‌లో మంగళవారం ఆక్సిజన్‌ పైపులైనులో స్వల్పంగా లీకేజీ సమస్య వచ్చింది. వాల్వ్‌లో సాంకేతిక సమస్య రావడంతో ప్రత్యామ్నాయంగా 100 సిలిండర్లను సిద్ధం చేయాల్సి వచ్చింది.
* కాకినాడలోని జీజీహెచ్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఫ్లో, ప్రెషర్‌ తక్కువగా ఉంది. సాధారణంగా 0.54 పాస్కల్‌ ఆక్సిజన్‌ రావాల్సి ఉంటే..0.4 పాస్కల్‌ మాత్రమే రోగులకు అందుతోంది. ఇటీవల సమస్య వస్తే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు.
* రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పైపులైను వ్యవస్థను సాంకేతిక సిబ్బంది మూడు షిఫ్టుల్లో పర్యవేక్షించాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు.
నిద్రకు భంగం ఉండకూడదని...
ఓ జిల్లా ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ ‘‘అర్ధరాత్రి బాధితుల నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు సిబ్బంది పీడనం పెంచుతున్నారు. తమ నిద్రకు భంగం కలగకుండా చూసుకునేందుకు సిబ్బంది కొందరు ఇలా చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. అర్ధరాత్రి ఆక్సిజన్‌ సరఫరా అధికంగా ఉంటోంది’’ అని తెలిపారు.

ఇదీ పరిస్థితి

రాష్ట్రంలోని 146 ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి 26,446 పడకలకు పైపుల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. ఆక్సిజన్‌ తరలింపు, ట్యాంకుల్లో నిల్వ చేయడం, ఆసుపత్రిలోకి పంపిణీ చేయడం ప్రైవేట్‌ ఏజెన్సీల బాధ్యత. రోగులకు సక్రమంగా ఆక్సిజన్‌ అందుతోందా లేదా అన్నది ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలి. ఈ బాధ్యతను ఆసుపత్రుల్లో పనిచేసే సీనియర్‌ అధికారికి అప్పగిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో నాలుగైదేళ్ల క్రితం పైపులైన్లను డిజైన్లు చేసి, అప్పటి అవసరాలకు తగ్గట్లు అమర్చారు.

ఇదీ చదవండి:

కోర్టుల వేసవి సెలవుల్లో మార్పులు

'మరాఠా కోటా' తీర్పు.. రిజర్వేషన్లకు లక్ష్మణ రేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.