ETV Bharat / city

రాష్ట్రంలో జాడలేని 'జాబు'లు.. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్​

No Jobs In AP : రాష్ట్రంలో కొలువుల జాతర సృష్టిస్తాం..! యువతకు భారీగా ఉద్యోగాలిస్తాం..! ఏటా జాబ్ క్యాలండర్‌ ప్రకటించి.. నిర్ణీత తేదీల్లో పోస్టులు భర్తీ చేస్తామంటూ.. ఎన్నికల ముందు జగన్‌ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావస్తున్నా.. ఆ మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలాయి. రెండేళ్ల తర్వాత ఆర్భాటంగా విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌.. జాబ్‌లెస్ క్యాలెండర్‌గా ఘనతకెక్కింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు లేవు. క్యాలెండర్‌లో మరో 13 నోటిఫికేషన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ వైఖరితో.. నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ.. ఆందోళన బాట పడుతున్నారు.

No Job Calendar
No Job Calendar
author img

By

Published : Sep 20, 2022, 1:18 PM IST

No Job Calendar : ఉద్యోగాల నోటిఫికేషన్లు, జాబ్‌ క్యాలెండర్‌పై ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ చేసిన ప్రకటనలు.. యువత, నిరుగ్యోగుల్లో ఆశలు పెంచాయి. కానీ ఆ హామీల అమలులో సీఎం జగన్‌, వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మాత్రం వారిని తీవ్రంగా కుంగుబాటుకు గురిచేస్తోంది. అధికారంలోకి రాగానే.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్‌... దాని నియామక బాధ్యతలను ఏపీపీఎస్సీకి కాకుండా పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించారు.

నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగాన్నీ ఏపీపీఎస్సీ నుంచి భర్తీ చేయాల్సి ఉన్నా.. అలా చేయలేదు. ఎన్నికల తర్వాత ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్‌-1, గ్రూప్‌-2 సహా మిగతా శాఖల్లో భర్తీ కోసం భారీగా ఉద్యోగ నియామక ప్రకటనలు వస్తాయని ఆశించిన అభ్యర్థులు, నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. 2019 మే నెలలో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వం.. తొలి ఏడాదిలో ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ఉద్యోగానికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. 2020లోనూ అదే పరిస్థితి. దాదాపు రెండున్నరేళ్లపాటు.. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క కొలువునూ ఇవ్వలేదు.

2018 నుంచి 2019 మార్చి వరకు ఏడాదిలో.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం.. 17 వేల పోస్టుల భర్తీకి పలు నోటిఫికేషన్లు ఇవ్వగా.. వాటిలో చాలా పోస్టులను నేటికీ వైకాపా సర్కార్‌ భర్తీ చేయని పరిస్థితి నెలకొంది. పరీక్షల సన్నద్ధత కోసం ఏళ్ల తరబడి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు.

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని.. నిర్ణీత తేదీల ప్రకారం నియామకాలు పూర్తిచేస్తామని.. 2019 సెప్టెంబర్‌లో సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేసి.. అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని చెప్పారు. ఆ ఏడాది జనవరిలో కొలువుల ప్రకటన ఉంటుందని ఆశించిన లక్షలాది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది.

కాలక్షేప మాటలే తప్ప నోటిఫికేషన్ల ఊసే లేదు. నిరుద్యోగుల ఆందోళనలతో రెండున్నరేళ్ల తర్వాత ఏట్టకేలకు జాబ్ క్యాలెండర్‌ విడుదల చేసినా.. వాటిలో గ్రూప్-1 పోస్టుల ప్రస్తావనే లేదు. వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నా.. కేవలం 32 పోస్టులతో గ్రూప్‌-2 ఉద్యోగాలిస్తామని చెప్పి.. నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. 2021 అక్టోబర్‌లో కేవలం 21 పోస్టులతో ఏపీపీఎస్సీ ద్వారా తొలి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది.

అప్పటి నుంచి ఇప్పటిదాకా.. పలు విభాగాల్లో ఉన్న పోస్టులకు 16 నోటిఫికేషన్లు ఇవ్వగా.. అన్నీ కలిపినా.. పోస్టుల సంఖ్య వెయ్యి కూడా దాటలేదు. వీటిలో ఏడాది క్రితం రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ల నియామకం కోసం 600 పోస్టులతో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషనే అతి పెద్దది. మిగిలిన నోటిఫికేషన్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ రాత పరీక్షలు నిర్వహించలేదు. గ్రూప్‌-3, గ్రూప్‌-4లో వేలాది పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా.. నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో.. నిరుద్యోగులు నిరాశనిస్పృహల్లోకి వెళ్లారు.

జాబ్‌ క్యాలెండర్‌లో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులు పెంచడంతోపాటు.. నోటిఫికేషన్లు విడుదల చేయాలని.. నిరుద్యోగులు రోడ్డెక్కి.. ఆందోళనలు తీవ్రతరం చేయడంతో.. ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టుల సంఖ్యను కాస్త పెంచింది. ఇకపై జాబ్‌ క్యాలెండర్‌ను అమలుచేస్తామంటూ మరోసారి ప్రకటనలు చేసింది. ఆగస్టులో గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన జారీ చేయనున్నట్లు.. 2022 జులై 5న.. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌.. మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు.

జాబ్‌ క్యాలెండర్‌లో పెండింగులో ఉన్న మరో 13 నోటిఫికేషన్లను గత ఆగస్టు నెలాఖరులో విడుదల చేస్తామని చెప్పారు. ఈసారైనా నోటిఫికేషన్లు వస్తాయన్న నమ్మకంతో అభ్యర్థులు.. వేల రూపాయలు చెల్లించి కోచింగ్‌ కేంద్రాల్లో చేరారు. నోటిఫికేషన్ల జాడ లేకపోవడంతో.. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం మాట తప్పిందని.. నిరుద్యోగులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. APPSC ద్వారానే ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉండగా.. అలా కాకుండా ప్రభుత్వ విభాగాలకు అప్పగించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో జాడలేని 'జాబు'లు.. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.