ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. అవునండి! ఇది నిజం. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరిలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. మల్కాన్‌గిరికి చెందిన ఇద్దరు యువతులు ఇంజినీరింగ్ వరకు కలిసి చదువుకున్నారు. ఒకరికి ఒకరు ప్రాణమయ్యారు. ఇద్దరి ఇళ్లలోనూ పెళ్లి ప్రస్తావనలు వస్తుండటం వల్ల.. తాము విడిపోతామన్న ఆలోచన నిలువనీయలేదు. వేర్వేరుగా ఉండలేమని పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనుకున్నారు. ఒకరు లింగమార్పిడి చేసుకుని పురుషునిగా మారాలని నిర్ణయించారు. పెద్దలకు చెప్పి ఒప్పించారు. అందుకుగాను వీళ్లలో ఒకరు గతేడాది లింగమార్పిడి చేయించుకున్నారు. ఈ రోజున ప్రేమికుల దినోత్సవం కావడం వల్ల వాళ్లిద్దరు ఒక్కటి కావాలనుకున్నారు. ఇద్దరి జాతకాల ప్రకారం నాలుగు రోజుల ముందుగానే 10న ముహూర్తం కుదిరింది. బంధుమిత్రుల కోలాహలం మధ్య సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.
ఇదీ చదవండి: అలనాటి 'విజేత'ను గుర్తు చేస్తున్న నేటి 'భీష్మ'