ETV Bharat / city

పైన అసలు బంగారం.. లోపల నకిలీ బాగోతం.. వీళ్ల మోసం మామూలుగా లేదుగా! - గుత్తిలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

Fake Gold Case in Anantapur District: మేం జేసీబీ పనులు చేస్తామని చెబుతారు..! పనులు చేస్తుండగా.. ఓ చోట తమకు పాత బంగారం దొరికిందంటారు..! తమకేం తోచటంలేదని.. ఎంతోకొంత ఇచ్చి.. తమ వద్ద ఉన్న బంగారం తీసుకోండి అంటూ.. అమాయకంగా మాట్లాడుతారు. నెమ్మదిగా.. ట్రాక్​లోకి దింపుతారు..! రూ. 2 కేజీల బంగారం.. రూ. 6 లక్షలకే ఇచ్చేస్తామని చెప్పేస్తారు! ఇంకేముంది.. ఈ నయా కేటుగాళ్ల మాటలను నమ్మినవారు అత్రుతగా వచ్చేస్తారు. ట్రయల్ ​రన్​లో భాగంగా.. అసలు బంగారమే చూపిస్తారు ఈ మోసగాళ్లు. ఇది నమ్మిన బాధితులు.. 6 లక్షలు అప్పజెప్పి.. 2కేజీల బంగారం తీసుకెళ్తారు. తీరా చూస్తే.. అది అసలు బంగారం కాదు.. నకిలీది అని తేలుతుంది. ఈ తరహా నయామోసం.. అనంతపురం జిల్లా గుత్తిలో వెలుగు చూసింది.

Fake Gold Case in Anantapur District
Fake Gold Case in Anantapur District
author img

By

Published : Dec 22, 2021, 4:27 PM IST

Updated : Dec 22, 2021, 4:38 PM IST

Fake Gold Case in Anantapur District: తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠా.. ఆట కట్టించారు అనంతపురం జిల్లా పోలీసులు. నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ చైతన్య వివరాలు వెల్లడించారు.

పోలీసుల వివరాలు ప్రకారం..
కడప జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు జేసీబీ ఆపరేటర్​గా పని చేస్తుంటారు. తవ్వకాల్లో భాగంగా తమకు పాత బంగారం దొరికిందని తెలంగాణలోని కరీంనగర్​కు చెందిన వ్యక్తిని నమ్మించారు. నెమ్మదిగా ట్రాక్​లోకి దింపారు. వారి వద్ద ఉన్న అసలు బంగారు పూసలను చూపించారు. సొమ్ము రూ. 20 లక్షలు ఉంటుందని... కేవలం రూ. 6 లక్షలకే ఇస్తామని మాయమాటలు చెప్పారు. కేటుగాళ్ల మాటలను నమ్మిన సదరు వ్యక్తి.. తక్కువ ధరకే ఎక్కవ బంగారం వస్తుందని ఆశపడ్డాడు. ఇంకేముంది... రూ. 6 లక్షలను వారికి అప్పగించి.., 2 కేజీల బంగారం తీసుకున్నాడు.

అసలు రంగు బయటపడింది..
ఇంతవరకు బాగానే ఉందనుకున్న కరీంనగర్​ వాసికి..ఒక్కసారిగా షాక్ తగిలింది. తాను తీసుకున్నది నకిలీ బంగారమని తేలటంతో.. మోసపోయామని గ్రహించాడు. ఇంకేముంది.. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

రైల్వేస్టేషన్​ దగ్గర కేటుగాళ్లు.. విచారణలో...
ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం.. గుత్తి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా.. నకిలీ బంగారు బాగోతం బయటపడింది. ఇద్దరు నిందితుల వద్ద నుంచి రూ.6 లక్షల నగదుతో పాటు 2 కేజీల నకిలీ బంగారు పూసలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్​కు తరలించనున్నట్లు డీఎస్పీ చైతన్య వెల్లడించారు.

ఇదీ చదవండి

వీధిరౌడీల్లా అశోక్ గజపతిరాజుపై.. మంత్రులు దాడికి తెగించారు: చంద్రబాబు

Last Updated : Dec 22, 2021, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.