గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన మోదుగుల దుర్గా ప్రసాద్, గుంటూరుకు చెందిన ఆమడ అరవింద్లు తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. ఉదయం నుంచి సరదాగా గడిపిన యువకులు.. సాయంత్రం కృష్ణానదిని చూసేందుకు బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు నదిలో దిగారు. ఈత రాకపోవడంతో నది ప్రవాహానికి కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న స్థానికులు, వారి కుటుంబసభ్యులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్ల సాయంతో పోలీసులు నదిలో గాలింపు చేపట్టారు. అరవింద్ మృతదేహం లభ్యం కాగా, దుర్గా ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుర్గాప్రసాద్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా... అరవింద్ గుంటూరులోని ఫ్యాన్సీ దుకాణంలో పనిచేస్తున్నాడు. యువకుల గల్లంతుతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి.