తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చెరువులో మునిగి రెండు ఎద్దులు మృతి చెందాయి. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో బెదిరిన కాడెద్దులు.. పరుగులు తీస్తూ దారి పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లిపోయాయి. కళ్లెదుటే నీట మునిగిప్రాణాలు కోల్పోతున్న ఎద్దులను రక్షించలేక కుమ్మరి రాముడు అనే రైతు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండి: