ETV Bharat / city

తెలంగాణ పాలిసెట్​ ప్రవేశాలకు షెడ్యూల్​ విడుదల - tspolycet-2020

టీఎస్​ పాలిసెట్-2020 ఫలితాలు బుధవారం ప్రకటించనున్నారు. ఈనెల 12 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించేలా షెడ్యూలు ఖరారు చేసినట్లు సెట్​ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు.

ts polycet admissions schedule released
పాలిసెట్​ ప్రవేశాలకు షెడ్యూల్​ విడుదల
author img

By

Published : Sep 7, 2020, 5:39 PM IST

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2020 ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈనెల 12 నుంచి ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్లు సెట్​ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఈనెల 12 నుంచి 17 వరకు ఆన్​లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈనెల 14 నుంచి 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈనెల 14 నుంచి 20 వరకు పాలిసెట్ వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఈనెల 22న పాలిటెక్నిక్ సీట్లను కేటాయించనున్నట్లు సెట్​ కన్వీనర్ వెల్లడించారు.

సీట్లు పొందిన అభ్యర్తులు ఈనెల 22 నుంచి 26 వరకు ఆన్​లైన్​లో ట్యూషన్ ఫీజు చెల్లించి..సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈనెల 30 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తారు. ఈనెల 30, అక్టోబరు 1నన వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఉంటుంది. ఈనెల 3న తుది విడత పాలిటెక్నిక్ సీట్లను కేటాయిస్తారు. అక్టోబరు 7న పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిర్ణయించినట్లు సెట్​ కన్వీనర్​ తెలిపారు. అక్టోబరు 7న పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లకు అక్టోబరు 8న మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు.

ఇదీ చదవండి:

కరోనా బాధితులకు డెంగ్యూ, మలేరియా ముప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.