భూవివాదంలో తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోక్యం చేసుకుంటున్నారని.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట సర్పంచి మల్లయ్య.. తెరాస పార్టీకి రాజీనామా చేశారు. గ్రామంలో పలువురితో తనకు భూవివాదం తలెత్తగా.. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఫోన్‌లో ఇష్టారీతిగా తనను దూషించాడని ఆరోపించారు. మానసికంగా వేధించడంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సర్పంచి మల్లయ్య ప్రకటించారు. గ్రామంలో పని చేయించేందుకు తన తరఫున జేసీబీ తీసుకొచ్చిన వ్యక్తిని ఎస్సై కొట్టారని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధించిన పనిచేస్తుంటే కొట్టడం సరికాదని... ఈ అంశంపై విచారణ చేపట్టాలని సీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
నన్ను ఇబ్బంది పెడుతున్నారు. పార్టీలో ఉండలేకపోతున్నా. నా ఆస్తిని పంచిపెట్టమంటున్నారు. ఎన్నికల్లో తిరిగినోళ్లకు నా ఆస్తిని ఇవ్వమంటున్నారు. రోడ్డు మీద ఉన్న నా వాహనాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని భరించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నా.
- మల్లయ్య, సర్పంచ్, కరీంపేట
ఇదీచూడండి:
VARAVARA RAO: బెయిల్ పొడిగింపు కోరుతూ బాంబే కోర్టులో వరవరరావు పిటిషన్