ETV Bharat / city

KCR: 'నీటి వాటా కోసం ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయండి'

సాగునీటి విషయంలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కోసం ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని తెరాస ఎంపీలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో కొట్లడాలని తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలకు సూచించారు.

KCR
ముఖ్యమంత్రి కేసీఆర్
author img

By

Published : Jul 17, 2021, 7:19 AM IST

సాగునీటి విషయంలో తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వకూడదని తెరాస ఎంపీలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటా కోసం ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని చెప్పారు. విభజన హామీల అమలు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించాలని అన్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, వాటి పురోగతి, అమలుపై సమీక్షించారు. విభజన హామీల అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉభయసభల్లో పోరాడాలని సీఎం ఎంపీలకు స్పష్టం చేశారు. సాగునీటికి సంబంధించిన అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

విరుద్ధంగా వెళ్లలేదు

ఆంధ్రప్రదేశ్​తో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో తాజా పరిణామాలను ఎంపీలకు సీఎం కేసీఆర్ (CM KCR) వివరించారు. తెలంగాణకు ఉన్న కేటాయింపుల్లో నుంచే జలాలను వాడుకుంటున్నామని... ఈ విషయంలో ఎక్కడా ట్రైబ్యునళ్లు, చట్టాలకు విరుద్ధంగా వెళ్లలేదని సీఎం చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ట్రైబ్యునల్ కేటాయింపులకు విరుద్ధంగా నీటిని బేసిన్ వెలుపలకు తరలిస్తోందని, కేటాయింపులు లేకుండా అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని అన్నట్లు తెలిసింది.

కృష్ణాపై కొత్త ప్రాజెక్టులేవీ లేవని... అన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్టులేనని మరోమారు వివరించినట్లు సమాచారం. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం తాజాగా జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్​పై కూడా తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ జరిగింది. పరిధి ఖరారు పర్యావసనాలు, ప్రాజెక్టుల నిర్వహణ, రాష్ట్రంపై ప్రభావం, తదితర అంశాలను అధికారులు, న్యాయవాదులు సమావేశంలో వివరించారు. దీనిపై మరింత లోతుగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని... అధికారులు, న్యాయవాదులతో ఇంకా చర్చిస్తానని కేసీఆర్ అన్నట్లు సమాచారం.

ఊరుకునే ప్రసక్తే లేదు

బోర్డుల పరిధి నిర్ణయంతో రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని సీఎం (CM KCR) స్పష్టం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రకాలుగా పోరాడతామని, గెజిట్ నోటిఫికేషన్ విషయంలోనూ అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. సాగునీటి విషయంలో రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వకూడదని ఎంపీలకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లోక్ సభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటా కోసం కేంద్రాన్ని నిలదీయాలని... గట్టిగా కొట్లాడాలని సూచించారు. విభజన హామీలు, పెండింగ్ సమస్యలను వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని తెరాస ఎంపీలు చెప్పారు.

పార్టీ వాణిని బలంగా వినిపించాలి

వివిధ అంశాలపై సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతి పత్రాలు అందించాలని ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన పౌరసరఫరాలశాఖ సమస్యలు పెండింగులో ఉన్నాయని... వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలవాలని మంత్రి గంగుల కమలాకర్, పార్లమెంట్ సభ్యులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ అంశాలపై పూర్తి సన్నద్ధతతో పార్లమెంట్​లో ప్రసంగించి రాష్ట్రానికి, పార్టీకి మంచిపేరు తీసుకురావాలని ఎంపీలకు ముఖ్యమంత్రి సూచించారు. జాతీయ అంశాల్లోనూ పార్టీ వాణిని సరిగా, బలంగా వినిపించాలని అన్నారు.

ఇదీ చదవండి:

Ministry of Jal Shakti: పార్లమెంటులో పెట్టే బిల్లులకంటే జాగ్రత్తగా గెజిట్‌ రూపొందించాం: జల్‌శక్తి శాఖ

అరకులో ముగ్గురు చిన్నారులు సహా తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.