ETV Bharat / city

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆధిక్యంలో తెరాస అభ్యర్థి - nalgonda-warangal-khammam mlc result 2021

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్​ స్థానం ఓట్ల లెక్కింపులో తొలి నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 15వేల 438 ఓట్ల ఆధిక్యంలో పల్లా మొదటిస్థానంలో నిలిచారు.

telangana graduate mlc election counting
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : Mar 18, 2021, 6:53 PM IST

తెలంగాణలోని నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. తొలి 4 రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి ముందంజలో ఉన్నారు. సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 15వేల 438 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న ఉండగా.. మూడో స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం నిలిచారు. నాలుగు రౌండ్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 63,442 ఓట్లు, తీన్మార్​ మల్లన్నకు 48,004 ఓట్లు, కోదండరామ్​(తెజస)కు 39,615 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డి (భాజపా)కి 23,703 ఓట్లు, రాములు నాయక్​(కాంగ్రెస్​)కు 15,934 ఓట్లు నమోదయ్యాయి. నాలుగు రౌండ్లలో 12,475 చెల్లని ఓట్లు గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.

ఇదీ చూడండి :

పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.