TRS leaders attack on KA Paul: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్తున్న కేఏ పాల్‌పై తెరాస నేత చేయి చేసుకున్నారు. కేఏపాల్ పర్యటనకు అనుమతి లేదని.. జిల్లాకు రాకుండా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో విషయం తెలుసుకున్న తెరాస శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. కేఏ పాల్ పోలీసులతో మాట్లాడుతుండగానే అక్కడే ఉన్న ఓ తెరాస నేత పాల్ చెంప పగలగొట్టారు. కేఏ పాల్ చెంపపై కొట్టడంతో గందరగోళం నెలకొంది. అక్కడున్న వారు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా.. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు కేఏ పాల్‌ను తన వాహనంలో ఎక్కించి హైదరాబాద్ వైపు తరలించారు.
పోలీసులపై కేఏ పాల్ ఫైర్ : అంతకుముందు ''మీరు ప్రభుత్వ ఉద్యోగులా.. లేక తెరాస కార్యకర్తలా..? మీకు తెరాస జీతాలు ఇస్తోందా.. లేదా ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయా..?'' అంటూ పోలీసులపై కేఏ పాల్ మండి పడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై దాడి జరిగింది.
ఇవీ చూడండి:
తాగి కారు నడిపి మహిళా అధికారి రచ్చ.. పోలీసులతో గొడవ
'మీడియా పేరుతో ఆమె బెదిరించింది.. బాధ కాస్తా భయంగా మారింది!'