TRS filled by petition to remove 8similar car symabals in munugode election: మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని తెరాస వేసిన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. డోజర్, రోడ్డు రోలర్ వంటి గుర్తులు తొలగించాలని నిన్న తెరాస శ్రేణులు చండూరు ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ.. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు రిటర్నింగ్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని తెరాస శ్రేణులు ధర్నా నిర్వహించాయి. కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ ను తొలగించాలని కోరుతూ ఈనెల 10న ఎన్నికల కమిషన్‌ను తెరాస కోరింది. ఈసీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని తెరాస చెబుతోంది.
కాబట్టి ఆ ఎనిమిది గుర్తులను తొలగించాలని తెరాస శ్రేణులు డిమాండ్ చేశాయి. ఆందోళనకు దిగిన తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని... తెరాస వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. తెరాస ప్రధాన కార్యదర్శి సోమభరత్ కుమార్ వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.
ఇవీ చదవండి: