ETV Bharat / city

లాక్​డౌన్​తో ప్రజల కష్టాలు... ఇష్టారీతిన వాహన దారుల వసూళ్లు - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణలో లాక్​డౌన్​ అమల్లో ఉంది. ఆర్టీసీ బస్సులు సడలింపునిచ్చిన సమయంలో (ఉదయం 6 నుంచి 10 గంటలవరకు) మాత్రమే తిరుగుతున్నాయి. రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల వద్ద క్యాబ్‌లు, ఆటోలు ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు. ఇంటికి చేరాలంటే భారీగా చెల్లించాల్సి వస్తోంది.

లాక్​డౌన్​తో ప్రజల కష్టాలు
లాక్​డౌన్​తో ప్రజల కష్టాలు
author img

By

Published : May 24, 2021, 11:16 AM IST

లాక్​డౌన్​తో ప్రజల కష్టాలు...ఇష్టారీతిన వాహన దారుల వసూళ్లు

తెలంగాణలో లాక్‌డౌన్ అమలుతో... ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైళ్లు యథావిధిగా నడుస్తుండగా..... బస్సులు మాత్రం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే తిరుగుతున్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వారు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరుకున్న తర్వాత ఇళ్లకు, గమ్యస్థానాలకు చేరాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఆటో, క్యాబ్‌లు అందుబాటులో ఉంటున్నా.. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ రోజుల్లో 50 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు అందుకు 10 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చి.. మళ్లీ ఇంటికి వెళ్లాలంటే జేబు గుల్లవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.

నగరంలో వివిధ ప్రాంతాల్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే వారికీ ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఓ పక్క చాలీచాలని జీతాలు... మరోపక్క ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ప్రైవేటు వాహనదారులతో అవస్థలు పడుతున్నారు. సొంత వాహనాలు లేక ప్రజారవాణా వ్యవస్థపై ఆధారపడినవారికి జేబులు చిల్లులు పడుతున్నాయి. వచ్చిన జీతంలో సగం ప్రయాణ ఖర్చులకే పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రైవేటు వాహనదారులు ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని.. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

'పాజిటివ్‌'తో ప్రయాణం.. పక్కవారికీ ప్రమాదం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.