అక్రమాస్తుల కేసుల్లో భాగంగా ఇందూ టెక్ జోన్ ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలంటూ తదుపరి విచారణలోగా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేస్తామని జగన్, విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టుకు తెలిపారు. అప్పటిదాకా అభియోగాల నమోదును వాయిదా వేయాలని కోరారు. ఇందూ టెక్ జోన్ చార్జ్ షీట్‌పై విచారణను ఈడీ కోర్టు జులై 1కి వాయిదా వేసింది. రఘురాం సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు గనుల శాఖ మాజీ సంచాలకుడు రాజగోపాల్ సమయం కోరడంతో అభియోగాల నమోదు ప్రక్రియను జులై 1కి వాయిదా వేసింది. పెన్నా సిమెంట్స్ కేసులో అభియోగాల నమోదు జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు, వాన్ పిక్ చార్జ్ షీట్లపై విచారణను.. గురువారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: