ETV Bharat / city

దేశంలో రెండో స్థానంలో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణాలు

హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణికుల సంఖ్యలో దేశంలో మొదటి స్థానంలో దిల్లీ నిలువగా.. రెండో స్థానంలో హైదరాబాద్ మెట్రో రైలు నిలించింది. లాక్ డౌన్ తర్వాత ప్రయాణికులు అంతగా మొగ్గు చూపకపోయినా.. కొద్దిరోజులుగా జంటనగరాల్లో మెట్రోను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. నగరంలో రోజుకు లక్షా 30 వేల మందికి పైగా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు.

travels
travels
author img

By

Published : Nov 9, 2020, 9:05 AM IST

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్టీసీతో ఇతర రవాణ వ్యవస్థలో తీసుకుంటున్న కరోనా జాగ్రత్తల కన్నా మెట్రోలో ఎక్కువ ఉన్నందున ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. మరోవైపు మెట్రో ప్రయాణికులకు క్యాష్ బ్యాక్, ట్రిప్పుల తగ్గింపు నేపథ్యంలో అదనంగా ప్రయాణిస్తున్నారు. దేశంలో దిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఇండియన్ మెట్రో ఆపరేటర్స్ గ్రూప్ సమాచారం ఆధారంగా శనివారం దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంది.

మెట్రో స్టేషన్

పొడవు(కి.మీ లలో)

స్టేషన్లు

రోజులో ప్రయాణికుల సంఖ్య

దిల్లీ 38928514,79,300
హైదరాబాద్ 69 57 1,33,974
చెన్నై 45 32 29,141
బెంగళూరు 42 40 68,716
కొచ్చి 26 23 11,106
నాగ్​పూర్​ 2516 4.051
లక్నో 29 22 2,020
జైపూర్12 11 20,160
ముంబై మెట్రో లైన్​ వన్11 12 32,322
ముంబై మోనో రైలు20 17 715

హైదరాబాద్ లో మొదట మూడు కారిడార్లలో దశల వారీగా ప్రారంభించి అన్ని కారిడార్లలో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. మొదట్లో కొద్ది రోజులు మూడు కారిడార్లలో కలిపి కేవలం 30 వేల మంది మాత్రమే ప్రయాణాలు చేశారు. ఆ తర్వాత క్రమేనా ఈ సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం రోజుకు సరాసరి లక్షా 30 వేలకు పైగా ప్రయాణిస్తున్నారు. నగరంలో బస్సుల్లో శానిటైజేషన్, సామాజిక దూరం అంతగా పాటించకపోవడం వల్ల ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు.

బస్​ ఛార్జీలతో పోలిస్తే మెట్రో ఛార్జీలు ఎక్కువే అయినా.. ఇటీవల ఆఫర్లు ప్రకటించగా రైళ్లలో ప్రయాణానికి జనాలు ఇష్టపడుతున్నారు. వీటితో పాటు మెట్రో స్టేషన్లలో కాంటాక్ట్​ లెస్ టికెటింగ్, కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు. కరోనాకు ముందు మెట్రోలో రోజుకు దాదాపు 4 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం మంది వర్క్​ఫ్రంహోమ్ చేస్తున్నారు. వీరంతా మునుపటిలా కార్యాలయాలకు వెళ్లడం ప్రారంభిస్తే మెట్రోకు ప్రయాణికుల నుంచి మరింత ఆదరణ లభించనుంది.

ఇదీ చదవండి:

బిల్డ్ ఏపీ మిషన్‌.. పలు శాఖలకు చెందిన భూముల వేలం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.