ETV Bharat / city

సొంతూళ్లకు వెళ్లేందుకు.. వలస కూలీల గోస!

author img

By

Published : May 10, 2020, 1:25 PM IST

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక మొత్తం 25,071 మంది వలస కూలీలున్నట్లు అధికారులు వివరాలు నమోదు చేశారు. వీరిలో ఇప్పటి వరకు 13,301 మంది తమ సొంత గ్రామాలకు తరలివెళ్లారు. ఎక్కువగా ఆంధ్రా, పశ్చిమబంగ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందినవారున్నారు. సుమారు 11 వేల మంది వలస, కాంట్రాక్టు కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది.

transport-problem-for-migrant-workers-to-return-to-their-native-in-lock-down

తాము స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా క్షేత్రస్థాయిలో వాహన ఏర్పాట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిక్కుకున్న వలస కార్మికులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. అధికారుల నుంచి రవాణా అనుమతుల్లో జాప్యం, సొంత ఖర్చుతో వాహనాలను సమకూర్చుకునే స్థోమత లేకపోవడం, తమ గుత్తేదారులు అందుబాటులో ఉండకపోవడం, ఇవన్నీ జరిగినా అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వెనక్కు పంపడం వంటి సమస్యలు వందలాది మంది కార్మికులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఏం చేయాలో పాలుపోక రాత్రీ పగలూ రహదారులపై తచ్చాడుతూ.. పిల్లలతోనే ఫుట్‌పాత్‌లపై నిరీక్షిస్తున్న వారెందరో?

ప్రభుత్వాలు ప్రకటించినంత వేగంగా ఏర్పాట్లు లేవన్నది వలస కార్మికుల ఆవేదన, ఆరోపణ. మరికొందరికి ఆధార్‌కార్డు, సొంత ఊరికి సంబంధించిన రుజువుల్లేకపోవడం తరలింపులో జాప్యానికి కారణమవుతున్నట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. తమను తీసుకొచ్చిన గుత్తేదారులు సైతం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉండటంతో వారి నుంచి సంజాయిషీలు తీసుకునే పరిస్థితులూ లేవన్నారు.

రైలు ఏర్పాటు చేయాలని వేడుకోలు

జిల్లా కేంద్రం (కొత్తగూడెం) లో ఉన్న భద్రాచలం రోడ్డు‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైళ్లలో తమను తరలించాలని సుదూరు ప్రాంత వలస కార్మికులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో చిక్కుకున్న వారిలో అత్యధికులం నీటి పారుదల ప్రాజెక్టులు, ప్రభుత్వ భవన నిర్మాణాలకు వచ్చినవారమేనని చెప్పారు. వాహనాల ఏర్పాట్లలో అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. రైళ్లను ఏర్పాటు చేసినా చాలా మంది వరకు జిల్లా నుంచి వెళ్లిపోయే పరిస్థితులున్నాయి. వీరిని తీసుకొచ్చిన చాలా మంది గుత్తేదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటూ మండలాలు, గ్రామస్థాయిలో పనులు చేస్తుండటంతో వాహనాలు ఏర్పాటు చేసేవారు లేక ఆయా కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

పాల్వంచ పట్టణంలోని గిరిజన బాలుర ఉన్నత పాఠశాలలో వసతి పొందుతున్న సుమారు 50 మంది వలస కూలీలు శనివారం సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు నడిచి వెళ్లారు. అయిదు రోజులుగా వాహన ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నా.. ఎలాంటి చర్యలు చేపట్టని కారణంగా... మండుటెండలోనే బయల్దేరి వెళ్లారు.

అందరిని పంపిస్తున్నాం

బతుకుదెరువుకు వచ్చిన వలస కూలీలందరినీ దాదాపు పంపించేశాం. ఇప్పుడున్న వారిలో గుత్తేదారులు తీసుకొచ్చిన వారు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ రంగాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు అధికంగా ఉన్నారు. వారు కోరితే సొంతూళ్లకు పంపేందుకు గుత్తేదారులతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరికీ ఇబ్బందిలేకుండా చర్యలు ఉంటాయి.

- ఎంవీ రెడ్డి, జిల్లా పాలనాధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.