Transfer: సొంత రెవెన్యూ డివిజన్ ప్రామాణికంగా కాకుండా సర్కిళ్ల ఆధారంగా బదిలీలు చేపట్టాలని వాణిజ్య పన్నులశాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆదివారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శాఖాపరంగా పునర్‌వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల 103గా ఉన్న సర్కిళ్లు 109 అయినట్లు తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉన్న సర్కిళ్లను కుదించి గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ నగరాల్లో పెంచారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సొంత రెవెన్యూ డివిజన్‌లో పోస్టింగ్ ఇవ్వకూడదన్న నిబంధన అమలు చేయడం ద్వారా నష్టపోతున్నామని, మారుమూల ప్రాంతాల్లోనే పని చేయాల్సి వస్తోందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ ద్వారా కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నందున బదిలీలకు అవరోధంగా ఉన్న ఈ నిబంధనను తొలగించాలని కోరింది.
రాష్ట్రంలో 155కుగానూ 55 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. దీనివల్ల వ్యాపారుల నుంచి పన్ను రాబట్టడంలో సమస్యలు తలెత్తుతున్నాయని వివరించింది.
ఇవీ చూడండి: