Revanth Arrested : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ రకాలుగా నిరసనలు తెలపాలని యువజన కాంగ్రెస్‌కు రేవంత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
రేవంత్ అరెస్టు అప్రజాస్వామికం
Revanth Arrest News : రేవంత్ రెడ్డి అరెస్టును పలువురు టీపీసీసీ నేతలు ఖండించారు. రేవంత్ అరెస్టు అక్రమమని, అప్రజాస్వామికమని మహేశ్ కుమార్, మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నిర్బంధకాండ అమలవుతోందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారని వాపోయారు.