- ఉచిత ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ
జులై 8న ఇళ్లస్థలాలకు సంబంధించి పట్టాలు పంపిణీ చేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. 29 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధిపై అధికారులు దృష్టిపెట్టాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మద్యం విక్రయాల'పై హైకోర్టులో వాదనలు
కరోనా సమయంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం తరఫు, పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డీజీపీ కోర్టుకు హాజరుకావాలి: హైకోర్టు
అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టులో విచారణ జరిగింది. వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించట్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డీజీపీ కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాబోయే రోజుల్లో తెదేపా ఉండదు
వైకాపా ప్రభుత్వానికి ప్రజాదరణ ఉందని.. రాబోయే రోజుల్లో తెదేపా కనుమరుగవుతుందని రాజ్యసభ సభ్యులు, మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో పర్యటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హజ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర ఈ ఏడాది భారత్ నుంచి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హజ్ యాత్ర కోసం దరఖాస్తు రుసుము మొత్తం వాపస్ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫ్యాబిఫ్లూ టు కొరోనిల్... ఏ మందు ఎవరికి?
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తీవ్రతను తగ్గించేందుకు మందులు వస్తున్నాయి. మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే వ్యాక్సిన్‌కు కాస్త సమయం పట్టనుండగా.. ప్రాణాలు కాపాడేందుకు మాత్రం ఈ మెడిసిన్లు సహకరించనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓవైపు చైనా.. మరోవైపు నేపాల్... ఎందుకిలా?
భారత్-చైనా సరిహద్దులో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మరో పొరుగుదేశం నేపాల్ కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్‌లోని ప్రాంతాలను తమ దేశంలో అంతర్భాగంగా పరిగణిస్తూ మ్యాప్‌ను రూపొందించి.. మరిన్ని వివాదాలు రాజేసేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధోనీ సారథ్యంలో మూడోసారి విశ్వవిజేతగా
టీమ్ఇండియా ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రోఫీని దక్కించుకుని నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013లో ఇంగ్లాండ్‌తో జరిగిన తుదిపోరులో గెలిచి.. రెండోసారి ట్రోఫీని భారత జట్టు ముద్దాడింది. టీ20, వన్డే ప్రపంచకప్‌ల తర్వాత ధోనీ సారథ్యంలో భారత్‌కు దక్కిన మూడో ఐసీసీ ట్రోఫీ ఇది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒలింపిక్ డే: ఆ రింగులు విభిన్న రంగుల్లో ఎందుకంటే?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్ 23వ తేదీని ఒలింపిక్ దినోత్సవంగా జరుపుతారు. అన్ని దేశాల్లో ఈ రోజున క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేకమైన పరుగు కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు, క్రీడలపై సెమినార్లు నిర్వహించి ఆటల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గడ్డ పార పట్టి పొలం పనులు చేసిన నవాజుద్దీన్
లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. తాజాగా పొలం పనులు చేస్తూ కనిపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో 'సేక్రెడ్ గేమ్స్'తో ఈ ఈయన గుర్తింపు పొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.