- Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- హిందూపురం బంద్ ఉద్రిక్తం.. భజరంగ్‌దళ్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించాలంటూ అఖిలపక్షాలు తలపెట్టిన బంద్ ఉద్రిక్తంగా మారింది. భజరంగ్ దళ్ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Statue of Equality Inauguration: శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవం.. ఏర్పాట్లు ఘనం
ఎంత దూరం నుంచైనా చిరునవ్వుతో పలకరించే తేజస్సు.. ఎన్నెన్నో ప్రత్యేకతలతో ఏర్పాటైన 216 అడుగుల దివ్యసుందర రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణోత్సవాలకు సిద్ధమవుతోంది. తెలంగాణలోని శంషాబాద్ సమీపాన ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఫిబ్రవరి 2న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- చివరి త్రైమాసికం అనుమతులు రానట్లేనా?
రాష్ట్ర ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.25,500 కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణం కావాలని రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించినా కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దాంతో రుణాలు తీసుకోవడం సాధ్యం కావడంలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'భాజపా హామీలన్నీ అబద్ధాలే... గద్దెదిగక తప్పదు'
ఉత్తర్‌ప్రదేశ్ గత ఎన్నికల సందర్భంగా భాజపా ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలాయని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈసారి భాజపాకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- చిన్నవయసులోనే సరిహద్దు దాటి.. హిందువునంటూ 15 ఏళ్లుగా..
భారత్‌లో అక్రమంగా 15 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను తాను హిందువుగా పేరు మార్చుకుని బెంగళూరులో నివాసం ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రియుడితో భార్య పరార్.. ఆమె భర్త ఏం చేశాడంటే?
అతని భార్య ప్రియుడితో వెళ్లిపోయింది. తిరిగిరావాలని ప్రాధేయపడినా నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త.. ఆమె ప్రియున్ని హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్ర, పాల్ఘర్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Union Budget 2022 : బడ్జెట్ కత్తిమీద సామే.. నిర్మలమ్మ ముందున్న సవాళ్లివే.!
ప్రకృతి విపత్తులు, అంటు రోగాలు ప్రబలిన సమయంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కత్తిమీద సామే. ఒకవైపు కోట్ల మంది ఉపాధి కోల్పోతే.. మరోవైపు ఉత్పత్తి పడిపోయి ధరలు పెరుగుతుంటాయి. ఆ సమయంలో ప్రభుత్వాలకు పన్ను ఆదాయాలు పడిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి. గత రెండేళ్లుగా దేశం కరోనా కారణంగా ఇలాంటి సంక్షోభాన్నే చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి1న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కీలక సవాళ్లకు ఆమె పరిష్కారం చూపించాల్సి ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Australian Cricket Awards: స్టార్క్‌కు అత్యున్నత పురస్కారం
2021-22 ఏడాదికి గానూ ఉత్తమ క్రికెట్లరకు తమ దేశ క్రికెట్లోని అత్యుత్తమ పురస్కారాలను ప్రకటించింది ఆస్ట్రేలియా బోర్డు. మిచెల్ స్టార్క్, గార్డ్నర్(ashleigh gardner) సహా పలువురు అవార్డులను అందుకున్నారు. వారెవరు? ఏ పురస్కారాలను అందుకున్నారంటే? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- క్వారంటైన్ వల్ల తల్లిని కలవలేకపోతున్న చిరంజీవి
తల్లి అంజనాదేవీకి బర్త్‌డే విషెస్ చెప్పిన చిరంజీవి.. క్వారంటైన్ వల్ల ఆమెను కలవలేకపోతున్నామని ట్వీట్ చేశారు. మరు జన్మలకు ఆమె దీవెనలు కావాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి