- కొత్తగా 36 కేసులు
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తూనే ఉంది. తాజాగా మరో 36 కేసుల నమోదుతో.. మెుత్తం కేసుల సంఖ్య 2100కు చేరింది. వైరస్ సోకిన కారణంగా మరొకరు మృతి చెందారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- రాష్ట్రానికి రాక
కేంద్ర ప్రభుత్వ సడలింపుల తర్వాత తొలిసారి దిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులతో విజయవాడకు రానుంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- థర్మల్ వెలుగులు
థర్మల్ విద్యుదుత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో దేశవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్యంలో తెలంగాణ జెన్‌కో అగ్రస్థానం (70.66 శాతం), ఆంధ్రప్రదేశ్ జెన్‌కో మూడో స్థానం (58.33 శాతం)లో నిలిచాయి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- జగన్ కిల్డ్ ఏపీ
మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణపై తెదేపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మి... ఏపీని చంపేస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- 24 గంటల్లో 134 మరణాలు
కరోనా మహమ్మారి దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 134 మంది వైరస్ బారిన పడి మరణించారు. కొత్తగా 3,722 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 78 వేలు దాటింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- టికెట్లు రద్దు
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరగటం, లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌లో ప్రయాణాల కోసం గతంలో బుకింగ్స్ చేసుకున్న అన్ని రకాల రైళ్ల టికెట్లను రద్దు చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- రెండోరోజు ఉద్దీపనలు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు మరోమారు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' కార్యాచరణలో భాగంగా ఆమె మరో దఫా ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- తొలిసారి
కొవిడ్-19తో విషమ పరిస్థితుల్లో ఉన్న ఆరుగురికి అమెరికాలో గుండె కణ చికిత్సను ప్రయోగాత్మకంగా అందించారు. వీరిలో నలుగురు కోలుకున్నారు. క్యాప్-1002 అని పిలిచే విధానాన్ని గుండె సమస్యలున్న వారికి, రోగ నిరోధక శక్తి అతిస్పందన కారణంగా తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి అనుసరిస్తారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- చెమట చిందిస్తోంది..!
అక్కినేని కోడలు సమంత లాక్‌డౌన్‌లోనూ చెమట చిందిస్తోంది. తన జిమ్ కోచ్‌తో వీడియో కాల్ ద్వారా కసరత్తులు చేస్తోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- అందుకు అంగీకరించడు..
జట్టు సారథ్యాన్ని పంచుకోవడం విరాట్ కోహ్లీకి నప్పదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. భిన్న సారథ్య సూత్రం టీమ్ ఇండియాకు పనికి రాదని అభిప్రాయపడ్డాడు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...