ETV Bharat / city

TOP NEWS: ప్రధానవార్తలు @ 9 AM

.

TOP NEWS
ప్రధానవార్తలు
author img

By

Published : Jul 7, 2022, 9:03 AM IST

  • YSRCP Plenary: వైకాపా ప్లీనరీకి సర్వం సిద్ధం..భారీ జనసమీకరణకు సన్నాహాలు
    వైకాపా ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్సిటీ ఎదురుగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ నిర్వహిస్తుండటంతో భారీ జనసమీకరణకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల్లోపు మరో ప్లీనరీ ఉండదు కాబట్టి దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కమిషనర్​తో కలిసి నన్ను హత్య చేయటానికి జగన్ కుట్ర: ఎంపీ రఘురామ
    సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రతో కలిసి తనను హత్య చేయడానికి ముఖ్యమంత్రి జగన్ కుట్ర పన్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. పోలీసులతో హత్య చేయించాలని చూస్తున్నందున తాను అప్రమత్తంగా ఉంటున్నానని అన్నారు. ప్రతి దానికీ హత్యే పరిష్కారమని భావించే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని.., హత్యా రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారో చూద్దామని వ్యాఖ్యనించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నాటి సీఎం ఆధ్వర్యంలోనే.. ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ: భూమన
    గత ప్రభుత్వ హయంలోనే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తలకు అందజేశారని సభ సంఘం అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచార చౌర్యం, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి అంశాలపై ఏర్పాటైన ఈ సంఘం భూమన అధ్యక్షతన బుధవారం శాసనసభ కమిటీ హాలులో సమావేశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Polavaram: రూ.18 కోట్ల చెల్లింపుల్లో అక్రమాలు
    Polavaram: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం, ఎడమ కాలువ కోసం చేపట్టిన భూసేకరణలో వివాదాల్లో ఉన్న భూములపై ఒకరిద్దరు అధికారులు లబ్ధి పొంది కొందరికి పరిహారం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో న్యాయస్థానాల ఆదేశాలనూ పక్కనబెట్టి కావాల్సిన వారికి చెల్లింపులు జరపడంతో కలెక్టరు, పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • స్పైస్​జెట్​కు షోకాజ్​ నోటీసులు! మరో విమానంలోనూ సాంకేతిక సమస్య
    స్పైస్​జెట్​ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్‌(డీజీసీఏ). ఇటీవల తరచూ జరుగుతున్న సాంకేతిక లోపాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. అన్నింటికన్నా ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమైందని ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • డోలో-650 మాత్రల తయారీ సంస్థపై ఐటీ దాడులు.. ఒకేసారి 40 చోట్ల..!
    Dolo 650 IT Raid: డోలో- 650 ఔషధాల తయారీ సంస్థపై ఐటీ శాఖ విస్తృత సోదాలు నిర్వహించింది. ఆదాయానికి తగిన పన్ను చెల్లించడం లేదని ఆరోపణల నేపథ్యంలో.. బెంగళూరు రేస్​ కోర్స్​ రోడ్డులోని మైక్రో ల్యాబ్స్​ లిమిటెడ్​ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ముదిరిన సంక్షోభం.. మరో 15 మంది మంత్రుల రాజీనామా.. బోరిస్​ను తప్పించలేరా?
    Britain political crisis: బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మంగళవారం ఇద్దరు కేబినేట్ మంత్రులు రాజీనామా చేయగా, బుధవారం మరో 15 మంది వారితో జత కలిశారు. ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న మంత్రులు, స్వపక్ష, విపక్ష ఎంపీల డిమాండ్‌ను ప్రధాని బోరిస్ జాన్సన్​ తోసిపుచ్చారు. బుధవారం ప్రతినిధుల సభలో జరిగిన ప్రశ్నావళి కార్యక్రమంలో ప్రధాని పదవిని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'వంట నూనెల ధర రూ.10 తగ్గించండి'.. కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
    edible oil price reduce: వంట నూనెల ధరలను లీటర్​కు రూ.10 వరకు తగ్గించాల్సిందిగా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గినందున.. ఆ ప్రయోజనాన్ని వినియోగదార్లకు బదలాయించాల్సిందిగా సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'బజ్‌బాల్‌' అంటే ఏమిటీ? ఆ పేరు ఎలా వచ్చింది?
    ఇటీవలే జరిగిన ఇంగ్లాండ్​-భారత్​ ఐదోటెస్టు మ్యాచ్​లో ఎక్కువగా వినిపించిన పేరు 'బజ్​బాల్'. అయితే బజ్​బాల్​ గురించి టీమ్ఇండియా కోచ్​ ద్రవిడ్​ను అడగ్గా.. తన తెలీదని సమాధానమిచ్చాడు. అసలు ఈ బజ్​బాల్​ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • సమంత 'పెట్‌'తో నాగ చైతన్య.. 'ప్రేమ' గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్!
    నాగ చైతన్య తాజాగా నటించిన మూవీ 'థ్యాంక్యూ'. ఈ సినిమా జర్నీతో పాటు తన తల్లి, తండ్రిల గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్​ చేశారు నాగచైతన్య. ఇక సమంత పెట్ హష్​ను కూడా గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.