- ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు
Road Accident: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయిన ఓ ట్రావెల్ బస్సు.. లారీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. 32మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Suspend: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నలుగురు పొరుగు సేవల సిబ్బంది సస్పెన్షన్
SUSPEND: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నలుగురు పొరుగు సేవల సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. దర్శనాలు, అదనపు వసూళ్లు చేస్తున్న నలుగురిపై.. ఈవో సాగర్‌బాబు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ సినిమా టికెట్ల విక్రయంపై.. హైకోర్టు ఏం చెప్పిందంటే?
Movie tickets: ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్ వేదిక ద్వారా మాత్రమే సినిమా టికెట్లను విక్రయించేందుకు తీసుకొచ్చిన సవరణ చట్టం, నిబంధనలు, జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో అనుబంధ పిటిషన్లపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దాంతో జులై 1న దీనిపై తగిన ఉత్తర్వులిస్తామని ధర్మాసనం పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- NTR WEBSITE: ఎన్టీఆర్‌పై వెబ్‌సైట్ ప్రారంభించిన చంద్రబాబు
NTR WEBSITE: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని.. ఆయన పేరుతో శత జయంతి ఉత్సవ సంఘం ‘100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. దాన్ని తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రపతి ఎన్నికలకు 115 నామినేషన్లు.. పోటీలో ఎంత మంది?
President election 2022: రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ గడువు ముగిసింది. మొత్తం 115 నామినేషన్లు దాఖలు కాగా.. 28 తిరస్కరణకు గురయ్యాయి. మరికొన్నిటిని గురువారం పరిశీలిస్తారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కేరళ నుంచి బుధవారం శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజీనామా.. విశ్వాస పరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే నిష్క్రమణ
Uddhav Thackeray Resigns: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ డ్రామా ముగింపు దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు ఠాక్రే. ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడిన ఉద్ధవ్.. తన నిర్ణయాన్ని వెలువరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వలసదారుల బోటు బోల్తా.. 13 మంది మృతి.. 40 మంది గల్లంతు
Senegal boat capsize: వలసదారులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన ఆఫ్రికాలోని సెనెగల్‌లో జరిగింది. బోటులో మంటలు రావడం వల్లే బోల్తా పడి ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బీచ్‌లో కాలక్షేపానికి రూ.5లక్షల కోట్ల కంపెనీ వీడిన సీఈఓ
ప్రముఖ ఫండింగ్ సంస్థ 'జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్' సీఈఓ ఆండ్రూ ఫార్మికా అకస్మాత్తుగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజీనామాకు ఆండ్రూ చెప్పిన కారణం విని అంతా ఆశ్చర్యపోతున్నారు. 'బీచ్‌లో కూర్చొని ఏమీ చేయకుండా కాలక్షేపం చేయాలనుకుంటున్నా' ఆండ్రూ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోహ్లీ ఫామ్‌లో లేకపోవడానికి కారణం అది కాదు: ద్రవిడ్
Kohli Rahul Dravid: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్. ఆటగాడి కెరీర్‌లో భిన్న దశలు ఉంటాయని అన్నాడు. విరాట్ అంతగా ఫామ్‌లో లేకపోవడానికి కారణం ప్రేరణ కొరవడడమో, బలమైన కోరిక లేకపోవడమో కాదని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Movies: కలల చిత్రం.. కళగా మార్చాలని ..
కలలు కనడం సులభమే. వాటిని సాకారం చేసుకోవడానికే అకుంఠిత దీక్షతో శ్రమించాల్సి ఉంటుంది. ఇలా శ్రమించి తమ కలల్ని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు. ఇక సినీ ప్రపంచంలో కలలన్నీ ఖరీదైనవిగానే ఉంటాయి. అందుకే ఇక్కడ తమ కలల చిత్రాల్ని సాకారం చేసుకోవడానికి ఎంత పెద్ద దర్శకుడైనా ఏళ్లకు ఏళ్లు నిరీక్షించక తప్పదు. తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌లను ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు పలువురు దర్శకులు. మరి వారెవరు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - ఆంధ్రప్రదేశ్ వార్తలు
.
ప్రధాన వార్తలు