ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11am - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 11am
ప్రధాన వార్తలు @ 11am
author img

By

Published : Feb 8, 2022, 11:01 AM IST

  • RAJAMPET BANDH: రాజంపేటలో సకలజనుల బంద్

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు బంద్ చేపట్టారు. దీంతో తెల్లవారుజాము నుంచే డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా రాళ్లను అడ్డుపెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • teachers protest: శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు..

రాష్ట్రంలో ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు రానున్నట్లు టీచర్లు తెలిపారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలోని 12 సంఘాలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. హెచ్‌ఆర్‌ఏ కనీస శ్లాబు 12 శాతానికిపైగా ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Somu: ఇళ్ల స్థలాల పేరిట రూ.5 వేల కోట్లు దోచేశారు: సోము వీర్రాజు

పేదలకు ఇళ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 5 వేల కోట్లు దోచేశారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పేదల ఇళ్లు, రేషన్ బియ్యం సహా అన్ని పథకాలకు కేంద్రం సాయం చేస్తుంటే... అంతా తమ ఘనత అన్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఏపీలో రెవెన్యూ లోటు.. బడ్జెట్‌ అంచనాలకంటే అధికం'

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.26,441 కోట్ల మేర ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి పేర్కొన్నారు. ఇది బడ్జెట్‌ అంచనాలకంటే అధికమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దివాళా, ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడేందుకు కేంద్రం సత్వరం జోక్యం చేసుకోవాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Covid Cases in India: భారీగా తగ్గిన కొవిడ్​ కేసులు- 1,118 మరణాలు

భారత్​లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 67,597 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 1,188 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భాజపా ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. మహిళపై రివర్స్​ కేసు

తనను 14 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారని భాజపా ఎమ్మెల్యేపై ఓ మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ మహిళే తనను బ్లాక్​మెయిల్​ చేస్తూ.. రూ.2 కోట్లు డిమాండ్​ చేస్తుందని ఆరోపిస్తూ ఆమెపై ఫిర్యాదు చేశారు ఆ ఎమ్మెల్యే. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఒమిక్రాన్‌.. పరిశీలన టీకా తయారీకి అనుమతి పొందిన సీరం

ఒమిక్రాన్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ పరీక్షలు, విశ్లేషణ కోసం అవసరమైన టీకాను తయారు చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Winter Olympic Torch Bearer: టార్చ్‌బేరర్‌ వివాదంపై చైనా ఏమందంటే..?

బీజింగ్​లో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో భాగంగా టార్చ్‌బేరర్‌ ఎంపికపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టార్చ్‌బేరర్‌ అంశంపై చైనా స్పందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి ఎంపిక నియమాలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • IPL 2022: ఆ జట్టు పేరు అహ్మదాబాద్‌ టైటాన్స్‌

ఐపీఎల్​ కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌.. తమ జట్టుకు 'అహ్మదాబాద్‌ టైటాన్స్‌' అని పేరు ఖరారు చేసింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Ravi Teja Khiladi: 'హాలీవుడ్‌ స్థాయిలో రవితేజ 'ఖిలాడి''

కథను నమ్మి సినిమాలు చేయడం వల్లే తనకు విజయాలు దక్కుతున్నాయని చెప్పారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రవితేజ హీరోగా ఆయన నిర్మించిన 'ఖిలాడి' చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు సత్యనారాయణ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.