- దీపావళి అంటేనే దివ్వెల పండుగ
అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని వెలిగించేదే దీపావళి. అలాంటి పండుగను ఎన్నో ఏళ్ల నుంచి పర్యావరణహితంగా జరుపుకొంటున్నాయి కృష్ణా జిల్లా గూడవల్లిలోని కొన్ని కుటుంబాలు. హానికరమైన టపాసుల జోలికిపోకుండా పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీకగా దీపాలను వెలిగిస్తూ..పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తెరపైకి మరోసారి ప్రత్యేక హోదా!
తిరుపతిలో జరగనున్న సదరన్ కౌన్సిల్ (Southern Zonal Council) సమావేశంలో.. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను ప్రస్తావించాలని సీఎం జగన్ నిర్ణయించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంకావాలని నిర్దేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రముఖ ఆలయాల్లో తితిదే విధానాల అమలు!
రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలోని ప్రధాన ఆలయాలతోపాటు, రద్దీ అధికంగా ఉండే దేవస్థానాల్లో.. తితిదే ఆచరిస్తున్న విధానాలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటికి సంబంధించి అధికారులు కొన్ని అంశాలను గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి మంగళం
ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోనుంది. ఆ పాఠశాలల్లోని వంట కార్మికులను ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసేందుకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రేమోన్మాది బాధిత కుటుంబానికి సీఎం జగన్ సాయం..రూ.10 లక్షలు అందజేత
గత సంవత్సరం ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన యువతి కుటుంబానికి సీఎం జగన్ ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అభినందన్ వర్ధమాన్‌కు పదోన్నతి!
భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు(Abhinandan Varthaman) పదోన్నతి లభించింది. వింగ్ కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- లఖింపుర్ ఖేరి కేసులో మరో ఇద్దరు అరెస్టు
లఖింపుర్ హింసాత్మక ఘటన(Lakhimpur Kheri Incident) కేసులో మరో ఇద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. నిందితులను రంజిత్ సింగ్, అవతార్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పశ్చిమాసియా క్వాడ్‌లో భారత్ భాగస్వామ్యం- భద్రతకు భరోసా
బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు(బీఆర్‌ఐ)తో పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో చైనా ఆర్థికంగా పాగా వేయడం భారత్, అమెరికాలనే కాదు- యూఏఈని సైతం కలవరపెడుతోంది. చైనాతోపాటు టర్కీ పోకడలూ పశ్చిమాసియాను చీకాకు పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, యూఏఈలతో కూడిన కొత్త క్వాడ్‌లో దిల్లీ భాగస్వామి అయింది. కొత్త క్వాడ్‌తో ఇజ్రాయెల్, యూఏఈలకు దగ్గరైన భారత్ అదే సమయంలో ఇరాన్‌ను దూరం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'యువ క్రికెటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు'
ముస్తాక్ అలీ ట్రోఫీ నేటి(నవంబర్ 4) నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gambhir News) యువ ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు. యువ ఆటగాళ్లు ఈ టోర్నీని బాగా ఉపయోగించుకోవాలని తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆదిపురుష్' షూటింగ్‌కు బైబై చెప్పిన ప్రభాస్
రెబల్‌స్టార్ ప్రభాస్(prabhas movies) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్‌ను ముగించుకున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి