- RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 50 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయి ఇప్పటికే పలు జిల్లాలో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Inter results: నేడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇవాళ ప్రకటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- earthquake: చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. బోడేవారిపల్లె, కూడవూరు, చిలకవారిపల్లె, కోటగడ్డలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకొచ్చారు. ఇళ్లలో వంటపాత్రలు చెల్లాచెదురయ్యాయి. భూప్రకంపనలతో ప్రజలు భయందోళనలకు గురయయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Reservoirs: నిండుకుండలా జలాశయాలు..నీటిమట్టం ఎంతంటే..
ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సిద్ధూ ప్రమాణ స్వీకారానికి వెళ్తుంటే ప్రమాదం- ఐదుగురు మృతి
పంజాబ్ మోగాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో ఒక బస్సు.. పంజాబ్ రోడ్డు రవాణా సంస్థకు చెందినది కాగా.. మరో బస్సు ప్రైవేట్ వాహనం అని మోగా ఎస్ఎస్పీ హరంబీర్ సింగ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ 256 మంది చిరు వ్యాపారులు.. 'పేద' కోటీశ్వరులు!
ఒకరు ఛాయ్ - సమోసా అమ్ముకునే వ్యక్తి.. మరొకరు ఛాట్ బండితో బతుకు బండి లాగిస్తున్న మనిషి.. ఇంకొకరు పండ్లమ్ముకుంటూ పొట్టనింపుకుంటున్న పేదవాడు..! ఇదంతా కేవలం పైకి కనిపించేదే. రోడ్ల పక్కన ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు సాగిస్తున్న వీరి ఆదాయం లక్షలు, కోట్లలో ఉంది. కొందరి వద్ద ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉండగా.. మరికొందరికి వందల ఎకరాల్లో సాగు భూమి ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వరద విలయం- 47 గ్రామాలు జలదిగ్బంధం
భారీవర్షాల కారణంగా మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. రాయ్‌గఢ్‌లో వరదల కారణంగా ఐదుగురు మృతిచెందారు. వరద ప్రవాహానికి 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీర ప్రాంతంలోని 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పిల్లలకు కొవాగ్జిన్ రెండో డోసుపై క్లినికల్ ట్రయల్స్!
2-6 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్ రెండో డోసు ఇవ్వటంపై ఎయిమ్స్ కీలక ప్రకటన చేసింది. కొవాగ్జిన్ టీకాపై వచ్చేవారం నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పిల్లల కోసం కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఇటీవల ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tokyo Olympics Medals: పతకాల వేటలో.. ఎవరిది పైచేయి?
ఒలింపిక్స్‌లో పతకాల వేటలో తొలిస్థానంలో ఉండేది దాదాపు అమెరికానే. ఒకటి రెండు సందర్భాల్లో చైనా కూడా ఈ గౌరవాన్ని దక్కించుకుంది. మరి ఈసారి విశ్వక్రీడల్లో తొలిస్థానం ఎవరికి దక్కనుందో చూడాలి మరి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అరెస్టు తప్పించుకునేందుకు రూ. 25 లక్షల లంచం!'
ఫోర్న్ చిత్రాల కేసులో భాగంగా తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు రాజ్ కుంద్రా.. భారీ మొత్తం లంచం ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు వెల్లడించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.