ETV Bharat / city

ప్రధాన వార్తలు @1 PM - trending news

..

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 24, 2020, 12:57 PM IST

  • 'వైఎస్​ఆర్ కాపు నేస్తాన్ని' ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. కాపు సామాజికవర్గంలోని మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు 'వైఎస్​ఆర్ కాపు నేస్తం' పథకాన్ని సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • హైకోర్టులో విచారణకు హాజరైన డీజీపీ..

అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై దాఖలైన కేసులో... డీజీపీ గౌతం సవాంగ్.. హైకోర్టుకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో తెదేపా నాయకుడు షేక్‌ గౌస్‌పై దాడి జరిగింది. రాళ్లు, కర్రలతో దుండగులు దాడి చేసిన ఘటనలో.. గౌస్‌ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పిడుగురాళ్లలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎస్‌ఈసీ నియామకంపై వ్యాజ్యం విచారణ వాయిదా

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకం చెల్లదంటూ దాఖలైన వ్యాజ్యం పై విచారణ జులై 8 కి వాయిదా పడింది. వ్యాజ్యానికి నంబరు కేటాయించే విషయంలో హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలతో ధర్మాసనం విభేదించింది. వ్యాజ్యాన్ని విచారించేందుకు నిర్ణయించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చాచి కొడితే చైనా మేజ‌ర్ ముక్కు ప‌గిలింది..

సిక్కిం సరిహద్దులో గస్తీ కాస్తున్న భారత లెఫ్టినెంట్​కు చైనా మేజర్​ ఈ భూభాగం తమది.. వెనక్కి వెళ్లిపో అంటూ హెచ్చరికలు చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన భారత లెఫ్టినెంట్​ చైనా మేజర్​ను చాచిపెట్టి కోట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • నలుగురు అన్నదమ్ములు జలసమాధి..

మహారాష్ట్రలోని ఓ కుటుంబంలో ఈత తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు అన్నదమ్ములు.. అక్కడే జలసమాధి అయ్యారు. కొడుకులందరూ మృతి చెందగా.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • మిజోరంలో మళ్లీ భూకంపం..

మిజోరంలో మరోసారి భూమి కంపించింది. బుధవారం ఉదయం సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్​ స్కేలుపై 4.1 గా నమోదైంది. అయితే.. వారం రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో ఇది నాలుగో భూకంపం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'రియల్​మీ'లో 7,500 నియామకాలు..

ఈ ఏడాది చివరి నాటికి భారత్​లో కొత్తగా 7,500 నియామకాలు చేపట్టనున్నట్లు స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ రియల్​మీ ప్రకటించింది. ఇంటర్​నెట్​ ఆఫ్​ థింగ్స్​ ఉపకరణాల తయారీ, విక్రయ బృందాల విస్తరణ కోసం ఈ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్ క్షమాపణలు

ఆడ్రియా టోర్నీ నిర్వహణలో జరిగిన పొరపాటుకు తనను క్షమించాలని కోరాడు టెన్నిస్​ స్టార్​ నొవాక్​ జకోవిచ్​. ఇందులో పాల్గొన్న జకోవిచ్​తో సహా ముగ్గురు టెన్నిస్​ ఆటగాళ్లకు కరోనా సోకడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సుశాంత్​ పెంపుడు శునకానికి ఏమైంది?

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతితో తన పెంపుడు శునకం ఫడ్జ్ కూడా​ కలత చెంది మృతిచెందిందని నెట్టింట్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు సుశాంత్​ సన్నిహితులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.