- ఆంగ్ల మాధ్యమంపై సర్వే..
పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాహన మిత్రకు సాయం..
2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీలు నడిపే యజమానులకు 10 వేల ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోర్టు తీర్పులే లెక్క చేయడు...
కోర్టుల తీర్పులనే లెక్క చేయనప్పుడు.. తెదేపా నేతలు ఇళ్లలో ఉండి దీక్షలు చేస్తే సీఎం జగన్ ఎలా స్పందిస్తారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతి దీక్షలపై ఒక్కరోజైనా స్పందించలేదన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ దేశాలను ఒంటరి చేయాలి...
ఉగ్రవాదులకు సాయం చేసే దేశాలను ఒంటరి చేయడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాలని... ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 5 కోట్ల మందికి కరోనా ముప్పు..
భారత్‌లో కనీసం 5 కోట్ల మందికిపైగా చేతులు శుభ్రం చేసుకునేందుకు అవసరమైన కనీస సదుపాయాలు లేవని అమెరికా పరిశోధనలో వెల్లడైంది. వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ పనులకు తక్షణమే అనుమతి..
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం తక్షణమే అనుమతిస్తుందని తెలిపారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మిగిలిన విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వారికి బిర్యానీపై మనసు లాగింది..
తమిళనాడు ఆసుపత్రిలో క్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులు ఆగలేక బిర్యానీ, తందూరి చికెన్ ఆర్డర్ చేసుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇట్టే చెప్పేస్తాయి..
కరోనాపై పోరులో భాగంగా జట్టుకట్టిన దిగ్గజ సంస్థలు యాపిల్-గూగుల్.. కొత్త సాంకేతికతతో ముందుకొచ్చాయి. వైరస్ నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునే విధంగా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీని రూపొందించాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రానా, మిహీకాల నిశ్చితార్థం..
టాలీవుడ్ యువకథానాయకుడు రానా, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం బుధవారం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు రానా. ఇరు కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టేడియంలో శృంగార బొమ్మలు..
ఫుట్‌బాల్ స్టేడియాన్ని సెక్స్ డాల్స్‌తో నింపి సియోల్ ఎఫ్‌సీ క్లబ్ మహిళా ప్రేక్షకులను అవమానించిందంటూ దాదాపు 62 లక్షల జరిమాన విధించింది కొరియన్ లీగ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.