- నాకు ప్రాణహాని ఉంది: లోక్‌సభ స్పీకర్‌కు రఘురామకృష్ణరాజు లేఖ
తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినందుకు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించానని.. అవకాశం లేకపోవడంతో తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా చెప్పానని రఘురామకృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. అప్పట్నుంచి తన నియోజకవర్గంలో పలువురు నేతలు అలజడి సృష్టిస్తున్నారని స్పీకర్‌కు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సూర్య గ్రహణం అనంతరం తెరుచుకున్న శ్రీవారి ఆలయం
సూర్యగ్రహణం వీడడంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తున్నారు. రాత్రి 8.30 గంటల వరకు ఏకాంతంగా తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోపల పంచాంగ శ్రవణం, రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. కరోనా నివారణ చర్యలలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు ప్రతిరోజు రాత్రి 7 గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు భక్తుల అనుమతిని తితిదే నిలిపివేసింది. రేపు ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చుట్టూ మంటలు.. మధ్యలో ఒంటికాలిపై ఎంపీ
చుట్టూ భగభగ మండే అగ్ని వలయాలు.. మధ్యలో ఒంటి కాలుపై తపస్సు చేసే మునులు, రుషులను సినిమాల్లో చూసుంటాం. కానీ, రాజస్థాన్‌లో ఓ భాజపా పార్లమెంట్ సభ్యుడు.. ఇంచుమించు ఇలాంటి సాధనే చేశారు. మండుటెండలో.. జ్వాలా వలయంలో నిలబడి యువతకు ఓ సందేశమిచ్చారు. ఏంటిదీ అంటారా? అయితే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గల్వాన్ లోయలో ఆ రోజు అసలేం జరిగింది?
భారత భూభాగంలో శిబిరం ఏర్పాటు... 300-350 జవాన్ల మోహరింపు... భారత సైన్యంపై దాడికి పక్కా కుట్ర... రాళ్లు, ఇనుప కడ్డీలతో సిద్ధం... గల్వాన్ లోయలో జూన్ 15 జరిగిన హింసాత్మక ఘర్షణకు ముందు పొరుగు దేశం సంసిద్ధత ఇది. భారత్ కథ మాత్రం భిన్నం. మనవైపు ఉన్నది అంతా కలిపి 100 మందే. అయినా... కర్నల్ సంతోష్ బాబు బృందం ఏమాత్రం బెదరలేదు. శత్రు సైన్యంపై విరుచుకుపడి... భారత సైన్యం పంజా దెబ్బ రుచి చూపించింది. చైనా శిబిరాన్నితునాతునకలు చేసింది. ఆనాడు సంతోష్ బృందం సాగించిన వీరోచిత పోరాటానికి సంబంధించిన మరిన్ని వివరాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జులై 1కి దేశంలో 6 లక్షల కరోనా కేసులు!
భారత్‌లో కరోనా కేసులు జులై 1 నాటికి 6 లక్షలు దాటవచ్చని.. మిషిగన్ వర్సిటీ పరిశోధకురాలు భ్రమర్ ముఖర్జీ అంచనా వేశారు. దేశంలో కరోనా తీవ్రత తెలుసుకోవడానికి భారీ స్థాయిలో సెరో సర్వే చేయాలని సూచించారు. లాక్డౌన్ ప్రయత్నం విఫలమైందని.. అందువల్ల దేశంలో క్రమంగా వైరస్ కేసులు పెరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పన, టెస్టింగ్ ల్యాబ్‌ల పెంపుపై దృష్టి సారించాలని సిఫార్సు చేశారు భ్రమర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ట్రంప్ ప్రచార శంఖారావం- ఫస్ట్ షో ఫ్లాప్!
కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతూ ఇంటికే పరిమితమైతే.. అమెరికా ప్రభుత్వానికి మాత్రం వైరస్ కన్నా ముఖ్యమైనది మరొకటి ఉందట. అవే ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు. అందుకే మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలోనూ ప్రచార హోరు మొదలైంది. వేల మందితో ట్రంప్ ఇండోర్‌లో సభ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల తర్వాత వేల మందితో జరగాల్సిన బహిరంగ సభను రద్దు చేశారు. అలా ట్రంప్ ఎన్నికల ప్రాచారానికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- షాపింగ్స్ మాల్స్ తెరిచినా కొనేవాళ్లు కరవు!
లాక్డౌన్ సడలింపుతో.. దాదాపు 70 రోజుల తర్వాత ఇటీవలే చాలా ప్రాంతాల్లో షాపింగ్‌మాల్‌లు, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకున్నాయి. ప్రస్తుతం ఆ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయి? షాపింగ్‌పై వినియోగదారుల సెంటిమెంట్ ఎలా ఉంది?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుటుంబ కలహాలు.. కుమార్తెతో సహా తల్లి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఆరేళ్ల కూతురితో సహా తల్లి బలవన్మరణం చెందిన ఘటన కర్నూలు జిల్లా గుంటుపల్లిలో జరిగింది. గుళికలు మింగిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హార్దిక్ 'పుష్అప్స్'కు బాలీవుడ్ భామలు ఫిదా
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 'పుష్అప్స్' వీడియోకు బాలీవుడ్ భామలు సయామీ ఖేర్, కరిష్మక్ తన్నా ఫిదా అయ్యారు. ఇది ఎలా సాధ్యమైందంటూ కామెంట్లు పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రణయ్-అమృత ప్రేమకథ నుంచి పోస్టర్ విడుదల
ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా ప్రణయ్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా చేసుకుని రామ్‌గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఓ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆర్జీవీ సోషల్‌మీడియాలో ఆదివారం విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.