ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ట్రెండింగ్ న్యూస్

ప్రధాన వార్తలు @ 3 PM

ప్రధాన వార్తలు @ 3 PM
ప్రధాన వార్తలు @ 3 PM
author img

By

Published : Mar 25, 2021, 2:59 PM IST

  • నేటి నుంచి ప్రతి జిల్లాలోని గ్రామ సచివాలయాల్లోనూ టీకాలు

నేటి నుంచి ప్రతి జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో టీకాలు వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం నుంచి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ వేక్సినేషన్ ప్రక్రియ అమలు చేయనున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఇసుక దోపిడిని అరికట్టేందుకే నూతన విధానం: మంత్రి పెద్దిరెడ్డి

పారదర్శకత కోసమే ప్రైవేటు సంస్థలకు ఇసుక సరఫరా అప్పగించేలా నూతన విధానం ప్రవేశపెట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నదీతీరంలో రీచ్‌ల పరిసర గ్రామాల్లో ఉండేవారికి ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ హల్​చల్​

గుంటూరు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ హల్​చల్​ చేసింది. అప్రమత్తమైన చెక్‌పోస్టు సిబ్బంది.. తాడేపల్లి పోలీసులకు మహిళను అప్పగించారు. అనంతరం సదరు మహిళ స్టేషన్‌ నుంచి పారిపోతుండగా పట్టుకొని, మళ్లీ స్టేషన్​కు తీసుకొచ్చారు. మహిళది విశాఖగా గుర్తించిన పోలీసులు.. భర్తకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • లాక్​డౌన్​కు ఏడాది- కరోనా కట్టడిలో ఎక్కడున్నాం?

130 కోట్లకు పైగా జనవాహిని నిర్బంధంలోకి వెళ్లి నేటికి ఏడాది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కరోనాపై భారత్ తన పోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ సానుకూలతలు, ప్రతికూలతలు.. ప్రస్తుత పరిణామాలపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'కొవిన్'​లో మార్పులు- రెండో డోసు షెడ్యూలింగ్ బంద్!

కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య విరామాన్ని సవరించిన నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు అధికారులు. కొవిన్ యాప్​లో రెండో డోసు అపాయింట్​మెంట్​ను ఆటోమేటిక్​గా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్​కన్నా ముందే గురువారం ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ రెండో విడత సమావేశాలు ఏప్రిల్​ 8 వరకు జరగాల్సి ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • భారత్​-రష్యా బంధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి సైనిక పరికాలు కొనుగోలు చేయడంపై భారత్​కు పరోక్ష హెచ్చరికలు జారీచేసింది అమెరికా. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే భారత్​పై ఆంక్షలు విధించే అంశంపై ఆలోచిస్తామని యూఎస్ అడ్మిరల్ జాన్ ఆక్విలినో తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • వీడియోకాన్‌ కేసులో దీపక్​ కొచ్చర్​కు బెయిల్​

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న దీపక్‌ కొచ్చర్​కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐసీఐసీఐ బ్యాంక్​ మాజీ సీఈఓ చందాకొచ్చర్ భర్త దీపక్​​కు గురువారం బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు.‌ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'టీమ్​ఇండియా దగ్గర మెషీన్ ఉంది.. అందుకే'

టీమ్​ఇండియాలో యువకులు ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తుండటంపై పాక్ మాజీ క్రికెటర్ ఇంజిమామ్ తెగ ప్రశంసించాడు. క్రికెటర్లను తయారుచేసే మిషన్ ఆ జట్టు దగ్గర ఉందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • హాట్​ టాపిక్​గా మారిన స్టార్​ జోడీలు!

కోలీవుడ్​ స్టార్ కపుల్​ నయనతార-విఘ్నేశ్​ శివన్​కు నిశ్చితార్థం జరిగిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. విఘ్నేశ్​ శివన్​ పోస్ట్​ చేసిన ఓ ఫోటోనే అందుకు కారణం. మరోవైపు రీల్​ కపుల్​ విజయ్​-రష్మిక కలిసి ముంబయిలో డిన్నర్​కు వెళ్లిన ఫొటోలు వైరల్​గా మారాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందా? అనే చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.