ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - బ్రేకింగ్ న్యూస్

ప్రధాన వార్తలు @ 3 PM

top news @ 3 pm
top news @ 3 pm
author img

By

Published : Jun 28, 2020, 2:56 PM IST

1. రాష్ట్రంలో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి 13 వేల 98కు బాధితుల సంఖ్య చేరింది. తాజా కేసుల్లో.. రాష్ట్రానికి చెందిన 755 మందికి కరోనా పాజిటివ్​గా తెలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50 మందికి.. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా సోకింది. వైరస్ ప్రభావంతో మరో 12 మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

2. పాస్‌ చేస్తారా.. పరీక్ష పెడతారా..?

కరోనాతో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా అందరినీ రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ చేసింది. ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ అదే నిర్ణయం తీసుకుంది. కేంద్రం సైతం సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసింది. అయితే దూరవిద్య విధానంలో పది, ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారి విషయంలో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

3. తెలుగువారి ఠీవీ- మన పీవీ: 'ఈటీవీ భారత్'​ అక్షర నివాళి

బహుముఖ ప్రజ్ఞశాలి, రాజనీతిజ్ఞుడు అన్న పదాలకు సరిపాటిగా నిలిచే వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఎన్నో భాషల్లో నిష్ణాతుడు ఆయన. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా.. ఏ పదవిని చేపట్టినా తదుపరి వ్యక్తులకు మార్గదర్శిగా నిలిచారు. ఆయన శతజయంతిని పురస్కరించుకొని 'ఈటీవీ భారత్'​ అందిస్తున్న ప్రత్యేక కథనాలు మీకోసం. క్లిక్ చేయండి

4. పీవీజీ.. భరతమాత ముద్దుబిడ్డ: మోదీ

మనసులో మాట కార్యక్రమంలో భాగంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు శ్రద్ధాంజలి ఘటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం పీవీ శతజయంతి సందర్భంగా.. దేశం మొత్తం భారతమాత ముద్దుబిడ్డను గుర్తు చేసుకుంటోందని పేర్కొన్నారు. కీలకమైన దశలో భారత్​కు నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

5. 'పరీక్షలు పెంచాం.. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయ్​'

దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళుతున్నట్లు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. తాము తీసుకునే ప్రతి నిర్ణయంలో ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ భాగస్వాములవుతున్నారని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

6. మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్​

గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత శంకర్ సింగ్ వాఘేలా కరోనా బారినపడ్డారు. గత నాలుగు రోజుల నుంచి జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

7. పీవోకేలో చైనా విమానాలు.. భారత్​కు వ్యతిరేకంగా కుట్ర

సరిహద్దులో శాంతి నెలకొల్పుతామని ఒకవైపు నీతి వాక్యాలు చెబుతూనే.. మరోవైపు పాకిస్థాన్​తో కలిసి భారత్​కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోంది చైనా. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దూ వాయుసేన స్థావరంలో గత వారం చైనాకు చెందిన ఐఎల్‌-78 ట్యాంకర్‌ విమానాన్ని భారత్‌ గుర్తించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

8. భారతీయ అమెరికన్ల ఆర్థిక స్థిరత్వంపై కరోనా ఎఫెక్ట్​

కరోనా వైరస్​ సంక్షోభం అమెరికాను కుదిపేసింది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లపై తీవ్ర ప్రభావం పడింది. ప్రతి ఐదుగురిలో ఇద్దరు.. తమ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో భారతీయ అమెరికన్లపై జరిగిన సర్వేలో ఈ విషయం తేలింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

9. వాహన బీమాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

వర్షాకాలం వచ్చింది. కొద్ది పాటి వానకే రోడ్లపైకి నీరు చేరడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. వర్షాలు, వరదలతో కొన్నిసార్లు వాహనాలు నీట మునగడం వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల ఇంజిన్​ చెడిపోయి రిపేర్​ చేయించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బీమా వర్తిస్తుందా? బీమా వర్తించాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

10. కుమార్తె కోసం రొమాంటిక్ సీన్స్​ చేయడం బంద్

బాలీవుడ్​ నటుడు అభిషేక్ బచ్చన్.. ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై రొమాంటిక్ సన్నివేశాలు, అలాంటి కథలతో తెరకెక్కే సినిమాలు చేయనని స్పష్టం చేశాడు. తమ కుమార్తె ఆరాధ్యకు నచ్చే తండ్రిలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.