ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

ప్రధాన వార్తలు @ 1PM

top news at 1pm
ప్రధాన వార్తలు @ 1PM
author img

By

Published : Jan 26, 2021, 12:59 PM IST

  • ట్రాక్టర్​ ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై లాఠీఛార్జ్

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం కొంతకాలంగా శాంతియుతంగా జరుగుతున్న అన్నదాతల ఆందోళనలు ఇవాళ ఉద్రిక్తతలకు దారితీశాయి. ట్రాక్టర్​ ర్యాలీ కోసం.. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని దిల్లీలోకి ప్రవేశించగా పలు చోట్ల ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గణతంత్ర కవాతులో 'బంగ్లా' సైనికులు

మొదటిసారిగా భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు బంగ్లాదేశ్​ సైనికులు. ఆ దేశానికి చెందిన మూడు విభాగాల్లోని 122 మంది సైనికులు దిల్లీ రాజ్​పథ్​లో కవాతు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనమండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ షరీఫ్... జాతీయ జెండా ఎగరేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రంలో రాజ్యాంగ తప్పిదాలు జరుగుతున్నాయి: చంద్రబాబు

రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా పాలన సాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా స్వామ్య వ్యవస్థలపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. . ఎన్నికల సమయంలో అధికారులు, ఉద్యోగులు పనిచేయాల్సింది ఎన్నికల కమిషన్ పరిధిలోనే అని గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మదనపల్లె ఘటన: పోలీసుల అదుపులో నిందితులు

మదనపల్లెలో జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన యువతుల తల్లిదండ్రులను పోలీస్​ స్టేషన్​కి విచారణ నిమిత్తం తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విరబూసిన తెలుగు పద్మాలు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి.. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి ముగ్గురిని, తెలంగాణ నుంచి ఒకరిని పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారిలో విజయవాడకు చెందిన వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురం జిల్లాకు చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, దేశంలో తొలి మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మొక్కలు నాటి అయోధ్య మసీదు నిర్మాణం షురూ

అయోధ్యలోని ధన్నీపుర్​లో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మొక్కలు నాటి ఈ నిర్మాణ పనులు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 2021లో భారత వృద్ధి రేటు 7.3%: ఐరాస

మహమ్మారి కారణంగా 2020లో భారత ఆర్థిక వ్యవస్థ 9.6శాతం క్షీణిస్తుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2021లో 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అవకాశాలపై ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం తయారు చేసిన నివేదికలో ఈ మేరకు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైరల్: మైదానంలో కొట్టుకున్న ఆటగాళ్లు

పోర్చుగల్ ప్రీమియర్​ లీగ్​లో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. మంగళవారం పోర్టో-ఫారెన్సె జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక.. పోర్టో జట్టు సారథి పెపె అదే జట్టులోని సహ ఆటగాడు మామడులోమ్ మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపు ఒకరి మీద మరొకరు చేయి చేసుకునే వరకు వెళ్లిందీ గొడవ. అంతలో మిగతా ఆటగాళ్లు వచ్చి వారిని విడదీసి గొడవను సద్దుమణిగేలా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కిర్రాక్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ షూటింగ్​కు సంబంధించిన గ్లింప్స్​ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.