- Govt Land Rights: ఆ ఇళ్లపై వారికే సంపూర్ణ హక్కులు.. ప్రభుత్వ నిర్ణయం
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత అసైన్డ్ ఇళ్లస్థలాలు, వాటిలో కట్టిన ఇళ్లను కొనుగోలు చేసి అనుభవిస్తున్న వారు, వారి వారసులకు.. ఆ ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పించనుంది. అయితే, వీరికి ఎవరైతే అమ్మారో.. వారికి ప్రభుత్వం స్థలం కేటాయించి 17.09.2021 నాటికి పదేళ్లు పూర్తయి ఉండాలి.
- TDP Politburo Meeting: రేపు తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం
రేపు తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాాలా? వద్దా? అనే అంశంతో పాటు పలు విషయాలను చర్చించనున్నారు.
- RTC Compassionate appointments: 'కారుణ్యం' చూపటం లేదు..
RTC Compassionate appointments: ఇన్నాళ్లూ ఊరించారు.. అప్పుడిస్తాం.. ఇప్పుడిసామని మాటలు చెప్పారు.. ఉద్యోగం వస్తుంది కదా అని ధీమాతో ఉన్న వారికి ఆర్టీసీ యాజమాన్య ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడేం చేయాలో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు.
- AP CRIME NEWS: దిండుతో భార్యను హతమార్చిన భర్త.. కారణమిదే..
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. చిన్న చిన్న కారణాలతోనే ఒకరిపై మరొకరు దాడులకు దిగుతున్నారు. కొందరైతే హత్యలు చేయడానికీ వెనుకాడట్లేదు. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరగ్గా.. గుంటూరు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హతమార్చారు.
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 223 మరణాలు
Corona cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 7,554 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 223 మంది మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 13,37,398 కేసులు వెలుగుచూశాయి.
- గెలుపోటములు తేల్చేది గజరాజేనా.. అందరి చూపు బీఎస్పీపైనే!
UP Election 2022: యూపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రధానంగా భాజపా, ఎస్పీల మధ్యే పోటీ కనిపిస్తున్నప్పటికీ.. బీఎస్పీని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ 18% ఓట్లు సాధించి.. ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముందని నిపుణులు తెలుపుతున్నారు.
- రష్యాను ఎదుర్కోవడానికి మేము సిద్ధం: బైడెన్
Biden on Russia: రష్యాను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. పుతిన్.. పక్కా ప్రణాళికతోనే ఈ యుద్ధాన్ని ప్రారంభించారని అన్నారు. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
- ఉక్రెయిన్ నింగిపై పట్టు కోసం రష్యా తిప్పలు.. బాంబులు లేవా?
Russia Ukraine War: ఆధునిక యుద్ధంలో శత్రు గగనతలాన్ని త్వరగా నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా కీలకం. లేకుంటే పైచేయి సాధించడం కష్టం. గగనతల దాడుల విషయంలో రష్యా వ్యూహం అనుకున్న స్థాయిలో సఫలం కాలేదని, ఉక్రెయిన్‌పై వైమానిక దాడుల్లో ఊహించినంత పురోగతి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
- ఖర్కివ్ నగరంలో ప్రవేశించిన రష్యా బలగాలు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరో ప్రధాన నగరం ఖర్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు భీకర దాడులు చేస్తున్నాయి రష్యా సేనలు. ఈ క్రమంలో ఖర్కివ్ నగరంలో రష్యాకు చెందిన బలగాలు దిగినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. ఆకాశ మార్గం ద్వారా నగరంలోకి ప్రవేశించినట్లు తెలిపిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
- జడేజా తల్లి, భార్యకు సమన్లు.. ఎందుకంటే?
Jadeja wife Court summons: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రీవాబాకు, ఆమె తల్లికి జామ్‌నగర్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. 2018లో జరిగిన ఓ రోడ్డు యాక్సిడెంట్లో భాగంగా కానిస్టేబుల్ దాడి కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి.