- ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. కీవ్‌లో పేలుడు
Putin declares war on Ukraine: అనుకున్నదే జరిగింది.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ ద్వారా ప్రసంగించిన పుతిన్.. ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
- ఉక్రెయిన్‌లో వరుస పేలుళ్లు... ప్రభుత్వ సైట్లపై సైబర్ దాడులు
Russia Ukraine war: ఉక్రెయిన్‌లోని అనేక నగరాలపై దాడులు జరుగుతున్నాయి. రాజధాని కీవ్ సహా కీలక నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. అదే సమయంలోఉక్రెయిన్ పార్లమెంట్, ప్రభుత్వ ఏజెన్సీల వెబ్సైట్లపై సైబర్ దాడులు జరిగాయి.
- 'యుద్ధ ప్రకటన'పై అమెరికా ఫైర్.. బాధ్యత రష్యాదేనన్న బైడెన్
రష్యా యుద్ధ ప్రకటనపై అమెరికా స్పందించింది. ఈ దాడుల వల్ల జరిగే నష్టానికి బాధ్యత రష్యాదేనని పేర్కొంది. దీనిపై మిత్ర దేశాలతో కలిసి చర్చించి నిర్ణయాత్మకంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
- రష్యా- ఉక్రెయిన్ యుద్ధం: ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్ పిలుపు
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ పరిస్థితి భారీ విపత్తుగా పరిణమించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
- Bio Asia Summit: హైదరాబాద్ వేదికగా...19వ బయో ఆసియా సదస్సు
Bio Asia Summit 2022: తెలంగాణలో హైదరాబాద్ వేదికగా నేటి నుంచి 19వ బయోఆసియా సదస్సు జరగనుంది. రెండు రోజుల పాటు వర్చువల్‌గా జరగనున్న ఈ సదస్సును తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహించే ఈ సదస్సులో దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొని కరోనా విసిరిన సవాళ్లు, నేర్చుకున్న పాఠాలు, ఆరోగ్యరంగంలో వచ్చిన మార్పులపై చర్చించనున్నారు.
- Telangana Letter To KRMB: 'కృష్ణా జలాల్లో చెరిసగం వాడుకునేలా చూడాలి..'
Telangana Letter To KRMB: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు సంబంధించి కృష్ణా బోర్డు రూపొందించిన రూల్ కర్వ్స్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో సవరణలు చేయాలని కోరుతూ ఈఎన్సీ మురళీధర్.. కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు ఆయన లేఖ రాశారు.
- స్టాక్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం- సెన్సెక్స్ 1800 పాయింట్లు పతనం
Stock markets: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకులాయి. సెన్సెక్స్ దాదాపు 1900 పాయింట్లు నష్టపోగా... నిఫ్టీ 500 పాయింట్లకుపైగా పతనమైంది.
- IND VS SL: కోహ్లీ, షోయబ్ రికార్డుకు చేరువలో రోహిత్
IND VS SL first T20 Rohith record: భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రెండు రికార్డులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి శ్రీలంకతో మెుదలయ్యే టీ20 సిరీస్‌లో 37 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కునున్నాడు.
- Valimai twitter review: అజిత్ 'వలిమై' సోషల్‌మీడియా రివ్యూ
Ajith Valimai twitter review: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'వలిమై' సినిమా నేడు(గురువారం) థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా చూసిన అభిమానులంతా మూవీ అదిరిపోయిందని సోషల్‌మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.