- కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుకుచేరిన మృతుల సంఖ్య
విజయవాడలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనతో కరోనా రోగులు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగింది- విజయవాడ సీపీ
విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థులో మంటలు అలుముకుని... భవనంలోని ఇతర అంతస్థులకు వ్యాపించినట్లు సీపీ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- స్వర్ణప్యాలెస్ హోటల్లో అగ్నిప్రమాదంపై సీఎం ఆరా
స్వర్ణప్యాలెస్ హోటల్లో అగ్నిప్రమాదంపై తక్షణ చర్యల తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం సహాయం అందించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఎన్కౌంటర్: వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ రాకేశ్ పాండే హతం
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ రాకేశ్ పాండే మృతి చెందాడు. యూపీ ప్రత్యేక కార్య దళం (ఎస్టీఎఫ్) చేతిలో రాకేశ్ హతమైనట్లు యూపీ ఎస్టీఎఫ్ ఐజీ అమితాబ్ యశ్ తెలిపారు. లఖ్‌నవూలోని సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. రాకేశ్‌పై లక్ష రూపాయల రివార్డ్ ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నేడే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రారంభం
మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సదుపాయాన్ని కల్పించే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారభించనున్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు మోదీ. ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, సేకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వరద విలయం- బిహార్‌లో 73 లక్షల మందిపై ప్రభావం
కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ.. నదుల ప్రవాహం ప్రమాదకర స్థాయిని మించుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గుడ్‌న్యూస్: ఈ నెల 12న తొలి కరోనా వ్యాక్సిన్
కొవిడ్ మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న తరుణంలో రష్యా శుభవార్త తెలిపింది. టీకా తయారీలో మూడో దశ పరీక్షలను పూర్తి చేసి, ఈ నెల 12న వ్యాక్సిన్‌ను రిజస్టర్ చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'భారత్- పాక్ జల వివాదంపై ఏ నిర్ణయం తీసుకోలేం!'
భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి తాము సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేమని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు డాన్ పత్రిక తెలిపింది. సమస్యను తటస్థ నిపుణుడికి లేదా కోర్టు మధ్యవర్తిత్వానికి అప్పగించే విషయంలో ఇరు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించి ఏదో ఒక ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించినట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అదిరే ఆఫర్లతో రిలయన్స్ 'డిజిటల్ ఇండియా సేల్'
ఈ నెల 11వ తేదీ వరకు ఆకర్షణీయమైన ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఎలక్ట్రానిక్స్‌పై రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరల్లో లభ్యమవుతాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'ధోనీ అప్పటివరకు క్రికెట్ ఆడతాడు'
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కెరీర్ గురించి మాట్లాడిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. అతడెప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు అస్వస్థత
శ్వాసకోశ సంబంధిత సమస్యతో శనివారం, ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. తనకు కరోనా పరీక్షలో నెగటివ్ వచ్చిందని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతానని ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి