- 'శాంతిభద్రతలు కాపాడేలా పోలీసుల చర్యలు ఉండాలి'
కుప్పంలో తెదేపా నేతలపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. శాంతిభద్రతలు కాపాడేలా పోలీసుల చర్యలు ఉండాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఐ బారి నుంచి కాపాడండి.. సీఎంకు వైకాపా మహిళా కౌన్సిలర్ విన్నపం
Request to CM YS Jagan: వ్యాపారాన్ని దెబ్బతీసి, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ నుంచి తమను కాపాడాలని సీఎం జగన్‌కు విన్నవిస్తూ.. ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన వైకాపా కౌన్సిలర్ వీడియో విడుదల చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తితిదే ఆలయాన్ని శుద్ధి చేస్తోంది. ఆలయ శుద్ధి కారణంగా ఉదయం 11 గంటల వరకు భక్తులకు దర్శనం నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుమల కనుమ రెండో రహదారిని పునరుద్ధరించిన తితిదే
Tirumala kanuma way: తిరుమల కనుమ రెండో రహదారిని తితిదే పునరుద్ధరించింది. తిరుమలకు వెళ్లే దారిలో ఇవాళ్టి నుంచి వాహనాలకు అనుమతి ఇచ్చారు. రహదారి నిర్మాణ పనులను అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. భారీ వాహనాలు కాకుండా ఇతర వాహనాలకు అనుమతిచ్చినట్లు ధర్మారెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 1న కొండచరియలు విరిగిపడి రాకపోకలు ఆగిపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజయ్యపేటలో అగ్నిప్రమాదం..వృద్ధురాలు సజీవదహనం
విజయనగరం జిల్లా తెర్లాం మండలం రాజయ్యపేటలో అగ్నిప్రమాదం జరిగింది. చలి కుంపటి నుంచి రవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. దీంతో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో వృద్ధురాలు సజీవదహనమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో తగ్గిన కరోనా కేసులు..
India Corona cases: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 1.68లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌తో మరో 277 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి తగ్గింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికాలో అదే ఉద్ధృతి.. ఫ్రాన్స్‌లో భారీగా తగ్గిన కొత్త కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 21,041,50 మందికి వైరస్ సోకింది. 4,608 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 311,019,858, మరణాలు 5,511,955కు చేరాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంబానీని మించిన జావో..
Binance CEO CZ's Net Worth: క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన 'బినాన్స్' అధిపతి చాంగ్‌పెంగ్ జావో ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానాన్ని పొందినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ (107 బిలియన్ డాలర్లు-10వ స్థానం), రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ (93 బిలియన్ డాలర్లు- 12వ స్థానం) మధ్య జావో చోటు పొందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సినిమా గెలవాల్సిన సమయమిది'
Rowdy Boys song: ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా తెరకెక్కిన చిత్రం 'రౌడీబాయ్స్'. తాజాగా ఈ సినిమాలోని 'డేట్ నైట్' పాటను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ క్రమంలో మాట్లాడిన బన్నీ.. "సంక్రాంతికీ చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది సినిమా గెలవాల్సిన సమయం" అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ధోనీ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా'..
Kohli about Dhoni advice: కెరీర్ ప్రారంభంలో ధోనీ ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని తెలిపాడు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. పంత్ విషయంలోనూ ఆ సలహా వర్తిస్తుందని చెప్పాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.