- దేశంలో కరోనా విలయ తాండవం ..
India covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 90,928 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో 325 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 2,630కి పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నీ భార్యను హైదరాబాద్ తీసుకొస్తే.. నీ సమస్య తీరుతుంది'
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కూతురిపై తండ్రి అత్యాచారం..
Father raped daughter: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడో మృగాడు. తోడుగా నిలవాల్సిన నాన్నే మద్యం మత్తులో తోడేలులా మారి... కన్నబిడ్డను చిత్రహింసలు పెట్టాడు దుర్మార్గుడు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తల్లి కావాలనే ఆరాటం.. ‘గర్భిణి’ నాటకం
pregnant lady drama: పిల్లల కోసం పరితపిస్తున్న ఆమె ఆ బాధ తట్టుకోలేక తాను గర్భవతినని అందరికీ చెప్పింది. తొమ్మిది నెలల పాటు ఆ నాటకాన్ని కొనసాగించింది.కాన్పు సమయం దగ్గర పడుతుంటే.. ఏం చేయాలో తెలియలేదు. చివరకు బిడ్డను ప్రసవించాక ఎవరో ఎత్తుకుపోయారని చెప్పింది. దీనిపై పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడడంతో అందరూ నివ్వెరపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెరిగిన బంగారం ధర..
Gold Price Today: దేశంలో బంగారం ధర రూ.260 మేర పెరిగింది. మరోవైపు.. వెండి ధర క్షీమించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శిథిలావస్థకు చేరిన పులిగడ్డ అక్విడక్ట్
PULIGADDA ACQUEDUCT: పరిసర ప్రాంతాల్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ... వేసవిలో తాగడానికి మంచినీరు, సాగునీరు దొరకని పరిస్థితి దివిసీమ ప్రజలది. కృష్ణాజిల్లాలో కృష్ణానదిపై పులిగడ్డ వద్ద నిర్మించిన అక్విడక్ట్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అటారీ-వాఘా సరిహద్దులో రిట్రీట్ సందర్శన నిలిపివేత
Flag-lowering retreat ceremony: అట్టారీలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో నిత్యం జరిగే... ఫ్లాగ్ లోయరింగ్ రిట్రీట్ సందర్శనను నిలిపివేస్తున్నట్లు సరిహద్ద భద్రతా దళం(బీఎస్ఎఫ్) తెలిపింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా సరిహద్దు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా ధాటికి అమెరికా విలవిల..
worldwide covid cases: అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం మరో 7 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. 1800 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డుస్థాయిలో 3.32లక్షల కేసులు వెలుగుచూశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రామీ అవార్డుల వేడుక వాయిదా
Grammy awards 2022: అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న ఒమిక్రాన్ కారణంగా ఈనెల చివర్లో జరగాల్సిన గ్రామీ అవార్డుల వేడుక వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జకోవిచ్‌కు ఘోర అవమానం
Australia Open Djokovic 2022: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌కు ఘోర అవమానం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అతడి వీసాను రద్దు చేశారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన తగిన వివరాలను జకోవిచ్ సమర్పించకపోవడమే కారణమని ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.