- PERNI NANI COMMENTS ON RGV: సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు: పేర్ని నాని
సినిమా టికెట్ల ధరలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లపై మంత్రి పేర్ని నాని స్పందించారు. రూ.100 టికెట్ ను వెయ్యి, 2 వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు. డిమాండ్, సప్లయ్ అంటారా....లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అని నిలదీశారు. సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కమిషన్ల కోసం ప్రజల ఆస్తుల తాకట్టుకు శ్రీకారం చుట్టారు'
గ్రహణ కాలం 2021 పేరిట తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారు. గత ఏడాది పాలనా వైఫల్యాలతో వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోవటంతో పాటు పేదలపై మోయలేని ఆర్ధిక భారo మోపారని ఆ వీడియో ద్వారా వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- టిక్కెట్ లేని ప్రయాణికులకు రూ.2.05 కోట్ల జరిమానా..
తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్‌లో గతేడాది డిసెంబరు నెలలో టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.2.05 కోట్ల మేర అపరాధ రుసుము వసూలు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఐదు ప్రత్యేక బృందాలు, ఇతర సిబ్బంది శ్రమించి టిక్కెట్లు లేని ప్రయాణికులను గుర్తించి 35,342 కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- EBC NESTHAM: 9న ‘ఈబీసీ నేస్తం’ సాయం
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఈబీసీ నేస్తం’ పథకానికి 3,92,674 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం కింద ఈబీసీ వర్గానికి చెందిన 45-60ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.15వేల చొప్పున సాయాన్ని అందిస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశంలో కరోనా విజృంభణ - ఒక్కరోజే 58వేల కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 58,097 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో 534 మంది ప్రాణాలు కోల్పోయారు. 15,389 మంది కొత్తగా కోలుకున్నారు. దేశంలో రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
Encounter in Kashmir valley: జమ్ముకశ్మీర్, పుల్వామా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 9 ఏళ్ల చిన్నారిపై 'జర్మన్ షెఫర్డ్' దాడి- యజమాని అరెస్ట్
Dog bites girl: ఓ జర్మన్ షెఫర్డ్ శునకం 9 ఏళ్ల బాలికపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు ఈ విషయం గమనించి చిన్నారిని కాపాడారు. శునకం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అమెరికాలో 95శాతం ఒమిక్రాన్ కేసులే.. ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయిలో..
అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 95శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులేనని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన సంస్థ పేర్కొంది. గత ఏడాదిలో విజృంభించిన డెల్టా మారిదిరిగానే ఒమిక్రాన్ పంజా విసురుతోందని పేర్కొంది. మరోవైపు.. ఫ్రాన్స్‌లో కొవిడ్ ఉగ్రరూపం దాల్చింది. ఒక్కరోజే 2.71 లక్షల కొత్త కేసులు వచ్చాయి. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్లలోనూ లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో భారత గోల్‌కీపర్ శ్రీజేష్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలవడంలో కీలకంగా వ్యవహరించిన గోల్‌కీపర్ శ్రీజేష్ ఓ ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఒకవేళ ఇది అతడికి వరిస్తే భారత్ తరఫున ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో హాకీ ప్లేయర్‌గా నిలుస్తాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అలా అలవాటు పడితే కష్టం: హీరోయిన్ అనుపమ
నిజ జీవితంలో ప్రేమలో పడి విడిపోయానని చెప్పిన అనుపమ.. సినిమాలోని లవ్‌సీన్స్ చేసేటప్పుడు మాత్రం దాని ప్రభావం ఉండకుండా చూసుకుంటానని తెలిపింది. ఈమె హీరోయిన్గా చేసిన మూడు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి