రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి 10వేలు చొప్పున వాహనమిత్ర పథకం కింద పంపిణీ చేయనున్నారు. సెప్టెంబరు 9న పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 1 లక్షా 75 వేల 352 మంది దరఖాస్తు చేసుకోగా.... 2250 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగతా 1 లక్షా 73 వేల 102 మంది అర్హులకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు.
ఏటా 10 వేల రూపాయల చొప్పున సొంతంగా ఆటోలు, క్యాబ్ లు నడుపుకునే వారికి ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వర్తింప చేసేందుకు ప్రభుత్వం ఏటా 400 కోట్లను కేటాయించింది. ఇందులో షెడ్యూలు కులాలకు 68 కోట్లు, గిరిజనులకు 20 కోట్లను ప్రత్యేకించారు. మిగతా 312 కోట్లను ఇతర కులాలకు చెందిన వారికి కేటాయించారు.
ఇదీచదవండి
పెండింగ్ బిల్లులు చెల్లించండి: కేంద్ర మంత్రికి లేఖలో చంద్రబాబు