ETV Bharat / city

రేపు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్‌ డ్రై రన్​ - కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్​కు సర్వం సిద్ధం

జనవరి 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్​కు సర్వం సిద్ధమైంది. 13 జిల్లా కేంద్రాల్లో ఈ డ్రై రన్​ను నిర్వహిస్తారు. ఒక్కొక్క జిల్లాలో మూడు ప్రాంతాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.

covid vaccine dry run in ap
కొవిడ్ వ్యాక్సినేషన్‌ డ్రైరన్​కు సర్వం సిద్ధం
author img

By

Published : Jan 1, 2021, 9:19 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేందుకు వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రకాల ప్రాంతాల్లో డ్రై రన్ ఏర్పాటు చేశారు. భోదనాసుపత్రి, శివార్లలో ఉండే ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీటిని నిర్వహించనున్నారు. 13 జిల్లా కేంద్రాల్లో ఈ డ్రై రన్ నిర్వహిస్తారు. ఒక్కొక్క జిల్లాలో మూడు ప్రాంతాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కేంద్రంలో 25 మందికి వ్యాక్సినేషన్ డ్రై రన్ ఉంటుంది. కొవిన్ సాఫ్ట్​వేర్ ద్వారా ఈ రన్​ చేపట్టనున్నారు. వ్యాక్సినేషన్ అమలులో ఎటువంటి లోపాలు జరగకుండా ఉండేందుకు ఈ రన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ డ్రై రన్​ను రాష్ట్ర, జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా పర్యవేక్షణ చేస్తారు. పోలింగ్ కేంద్రం తరహాలో కార్యక్రమం అంతా వీడియో చిత్రీకరణ చేస్తారని అధికారులు తెలిపారు. డ్రై రన్ అమలుపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణనిచ్చామని...వ్యాక్సినేషన్ లబ్దిదారుల వివరాలను ముందుగానే కోవిన్ సైట్​లో పొందుపరిచినట్లు వారు స్పష్టం చేశారు. లబ్దిదారుల ఫోన్​కు ముందుగానే వ్యాక్సినేషన్​కు సంబంధించిన సమాచారం వస్తుందని అధికారులు వివరించారు. ఒక్కొక్క కేంద్రంలో ఐదుగురు సిబ్బంది ఉంటారు. వ్యాక్సినేషన్ తర్వాత కూడా సదరు వ్యక్తి చరవాణికి సమాచారం వస్తుందని చెప్పారు. ఈ రన్ అమలులో ఎటువంటి సమస్యలు తలెత్తాయో నివేదిక తయారు చేసి టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదించనుంది.

ఇదీ చదవండి:

'న్యాయం చేయమని అడిగితే...అట్రాసిటీ కేసులు పెడతారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.