రాజధాని రైతుల మహాపాదయాత్రకు ఐకాస నేతలు శనివారం విరామం(break of amaravati farmers padayatra at tomorrow) ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం నిడమనూరు గ్రామ పంచాయతీలో 12వ వార్డుకు ఈ నెల 14వ తేదీన ఉపఎన్నిక(by-poll) జరగనుంది. ఫలితంగా పాదయాత్ర జరపరాదని ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారి ఆదేశాలను గౌరవిస్తూ.. పాదయాత్రకు ఐకాస నేతలు విరామం ప్రకటించారు. 12వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లా యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆగింది. రైతులు ఇవాళ(శుక్రవారం), రేపు(శనివారం) అక్కడే బస చేయనున్నారు. తిరిగి ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభం(sunday morning) కానుంది. రైతుల పాదయాత్ర నిడమనూరు చేరుకునే సమయానికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఐకాస నేతలు తెలిపారు.
అడుగడుగునా ఘనస్వాగతం...
నేడు ఒంగోలులో బృందావన కళ్యాణ మండపం నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. పోలీసుల పహారా నడుమ యాత్ర కొనసాగుతోంది. రైతులకు.. ప్రజలు అడుగడుగునా పూలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. రైతుల పాదయాత్రకు స్థానికులే కాకుండా సమీప గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై అమరావతి అనే నినాదాలు, డప్పు శబ్దాలు, కోలాట నృత్యాల మధ్య పాదయాత్ర సందడిగా సాగుతోంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న రైతుల డిమాండ్‌కు ప్రకాశం జిల్లా ప్రజలు మద్దతు పలికారు. ఇవాళ్టి పాదయాత్రలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్‌తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ పార్టీ అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.
రైతులపై లాఠీఛార్జ్...
ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర(amaravathi farmers padayatra).. గురువారం పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. ఇన్ని కఠిన ఆంక్షలు, నిర్బంధాల్నీ తోసిరాజని పరిసర గ్రామాల నుంచి వేల మంది తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు. అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో బలగాల్ని మోహరించిన పోలీసులు.. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు. చెక్‌పోస్టులు పెట్టి వాహనాల్ని మళ్లించారు. కనిపించిన ప్రతిఒక్కరినీ ఎక్కడికి వెళుతున్నారో అడిగి, పాదయాత్రకు కాదని నమ్మకం కుదిరితేనే పంపించారు.
వందల మంది పోలీసులు లాఠీలు(lotties) పట్టుకుని, పాదయాత్ర ముందు సాగుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. వాహనాలపై తిరుగుతూ ప్రజల్ని అడ్డుకున్నారు. పాదయాత్రకు వెళ్లేందుకు వీల్లేదని, ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. హెచ్చరికల్ని కాదని ముందుకు వచ్చినవారిని తోసిపారేశారు. వందల మంది పోలీసులు రోప్‌పార్టీలతో ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు ఎదురుతిరిగి రైతుల దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు. ఒకరి చెయ్యి విరిగింది. నిబంధనలకు లోబడి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రకు కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ పేరుతో కావాలనే ఆంక్షలు సృష్టిస్తున్నారని రైతులు, ఐకాస నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీచదవండి.
- MINISTER PERNI NANI: బయట కాలరెగరేసి.. లోపల కాళ్లు పట్టుకోవడం తెలియదు: పేర్ని నాని
- YCP MLC Candidates: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైకాపా అభ్యర్థులు వీరే..
- CM Jagan: ఆస్పత్రికి ముఖ్యమంత్రి జగన్... అపాయింట్మెంట్లన్నీ రద్దు
- WEATHER UPDATE: ఉపరితల ద్రోణి.. రాగల 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
- SAJJALA: మా గురించి తెలంగాణ మంత్రులకు ఎందుకు ? తెదేపా నేతల్లాగే వారి మాటలు: సజ్జల
- PRC: పీఆర్సీపై రాని స్పష్టత..జేఎస్సీ భేటీని బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు