ETV Bharat / city

నేటి నుంచి రెండో డోసు కొవాగ్జిన్‌ పంపిణీ - Anilkumar Singhal latest news

రాష్ట్రంలో ఇవాళ, రేపు రెండో డోసు కింద కోవాగ్జిన్‌ టీకా పంపిణీ చేయనున్నట్లు.. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. రెండో డోసు కింద 90వేలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో 252 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నట్లు సింఘాల్‌ స్పష్టం చేశారు.

Anilkumar singhal
అనిల్‌కుమార్‌ సింఘాల్‌
author img

By

Published : May 26, 2021, 6:41 AM IST

రాష్ట్రంలో బుధ, గురువారాల్లో రెండో డోసు కింద కొవాగ్జిన్‌ టీకా పంపిణీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ప్రస్తుతం 1,17,980 కొవాగ్జిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిలో రెండో డోసు కింద 90వేలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ''కేంద్రం నుంచి 4.35 లక్షల కొవిషీల్డ్‌ డోసులు రాష్ట్రానికి అందాయి. రాష్ట్ర ప్రభుత్వం 12.74 లక్షల కొవిషీల్డ్‌ డోసులను నేరుగా కొనుగోలు చేసింది. వీటిని క్షేత్రస్థాయిలో పనిచేసే 45 ఏళ్లు నిండిన ఉద్యోగులకు సోమవారం నుంచి అందచేస్తున్నాం. కొవిషీల్డ్‌ టీకాలను జూన్‌ 15 వరకూ మొదటి డోసు కింద అందచేస్తాం. కృష్ణపట్నం ఆనందయ్య మందు సామర్థ్యంపై శుక్రవారంలోగా స్పష్టత వస్తుందని భావిస్తున్నాం. హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిన ఈ మందు నమూనాల పరీక్షల ఫలితాలు త్వరలో వస్తాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 252 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు గుర్తించాం. బాధితుల కోసం ఆదివారం/సోమవారం 900 యాంఫోటెరిసిన్‌-బి వయల్స్‌, మంగళవారం మరో 2,100 యాంఫోటెరిసిన్‌-బి వయల్స్‌ను ఆసుపత్రులకు సరఫరా చేశాం. తుపాను నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కేంద్రం నుంచి 767 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ తీసుకున్నాం. ప్రస్తుతానికి అన్ని ఆసుపత్రులకు కలిపి 650 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉపయోగిస్తున్నాం. మిగిలిన ఆక్సిజన్‌ను భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించేలా నిల్వ చేస్తున్నాం'' అని అనిల్‌కుమార్‌సింఘాల్‌ తెలిపారు.

కొవాగ్జిన్‌ టీకా డోసులు రాక

హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకా డోసులు మంగళవారం రోడ్డు మార్గంలో రాష్ట్రానికి చేరాయి. 8 పెట్టెల్లో సుమారు 50 వేల టీకా డోసులు రాగా.. తొలుత గన్నవరంలోని ఏపీ టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

ఇదీ చదవండి:

విజయనగరం జిల్లాలో బ్లాక్​ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.