ETV Bharat / city

తెలంగాణలో రికార్డు స్థాయిలో 872 కరోనా కేసులు - రాష్ట్రంలో ఉగ్రరూపం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 8674 కు చేరింది. ఇవాళ కొత్తగా మరో 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

today 872 new corona positiven cases intelangana
తెలంగాణలో రికార్డు స్థాయిలో 872 కరోనా కేసులు
author img

By

Published : Jun 22, 2020, 10:13 PM IST

Updated : Jun 22, 2020, 10:46 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 872 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 713 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. వైరస్​ బారిన పడి ఇవాళ ఏడుగురు మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 217కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 8,674 కేసులు నమోదయ్యాయి. ఇవాళ 3,189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 60,243 మందికి కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. కరోనా నుంచి కోలుకుని ఇవాళ 274 మంది డిశ్చార్జయ్యారు. వైరస్​ నుంచి కోలుకుని ఇప్పటివరకు 4,005 మంది ఇళ్లకు వెళ్లారు. ఆస్పత్రుల్లో 4,452 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో మరో 713 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా... రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌ జిల్లా-16, సంగారెడ్డి జిల్లా-12, వరంగల్‌ రూరల్‌ జిల్లా-6, మంచిర్యాల జిల్లా-5, కామారెడ్డి జిల్లా-3, మెదక్‌ జిల్లా-3, జనగామ, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో 2 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి: ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ పచ్చజెండా

Last Updated : Jun 22, 2020, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.