ETV Bharat / city

సీఎం ఇంటి ముట్టడికి భజరంగ్ దళ్ పిలుపు.. భారీ భద్రత

హైదరాబాద్ లో ఉన్న ఏపీ సీఎం జగన్ ఇంటి ముట్టడికి భజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు.. 300 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tight security near Cm jagan's house at hyderabad lotuspond

author img

By

Published : Sep 23, 2020, 11:45 AM IST

Updated : Sep 23, 2020, 11:51 AM IST

సీఎం ఇంటి ముట్టడికి భజరంగ్ దళ్ పిలుపు.. భారీ భద్రత

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద.. అక్కడి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తిరుమల డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో.. జగన్ ఇంటి ముట్టడికి భజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. జగన్ సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడులు పెరిగాయని, మత మార్పిడులు పెరిగాయని భజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా 300 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జగన్ నివాసానికి 200 మీటర్ల దూరంలో బారికేడ్స్ ఏర్పాటు చేశారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా ఉన్న పరిస్థితుల్లో.. నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. జగన్ ఇంటి వద్ద రాకపోకలు చేస్తున్న వారిని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

Last Updated : Sep 23, 2020, 11:51 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.