ETV Bharat / city

శంషాబాద్ పరిసరాల్లో చిరుత సంచారం.. ప్రజల్లో భయం - Shamshabad Airport in Rangareddy district

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. రాత్రి 11గంటల సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయ రన్​వే వైపు చిరుత వెళ్లినట్లు ఓ వ్యక్తి గమనించి.. అధికారులకు సమాచారం అందించాడు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Tiger roaming around in Shamshabad Airport
శంషాబాద్ పరిసరాల్లో చిరుత సంచారం.. ప్రజల్లో భయం
author img

By

Published : Jan 18, 2021, 2:12 PM IST

శంషాబాద్ పరిసరాల్లో చిరుత సంచారం.. ప్రజల్లో భయం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పెద్దగోల్కొండ గ్రామ శివారు ప్రాంతం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయ రన్​వే వైపు చిరుత వెళ్లినట్లు ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

అటవీ అధికారులు సోమవారం ఉదయం నుంచి చిరుత జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్ద గొల్కొండలో బ్లూడాట్ సంస్థకు చెందిన గోదాం వెనకాల నుంచి చిరుతపులి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఒకటి రెండు రోజులపాటు నిఘా పెట్టి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని అటవీ అధికారులు తెలిపారు.

తుక్కుగూడ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు పరిసర ప్రాంతాల ప్రజలు ఇప్పటికే అటవీ అధికారులకు తెలిపారు. అదే ఇటువైపు వచ్చుండొచ్చని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.