ETV Bharat / city

తెలంగాణ: రుణ యాప్‌ల వ్యవహారంలో మరో ముగ్గురి అరెస్టు - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

రుణ యాప్‌ల వ్యవహారంలో మరో ముగ్గురిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్​ చేశారు. బెంగళూరుకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 4 చరవాణుల స్వాధీనం చేసుకున్నారు.

రుణ యాప్‌ల వ్యవహారంలో మరో ముగ్గురి అరెస్టు

author img

By

Published : Dec 25, 2020, 9:58 PM IST

ఆన్​లైన్ రుణాలు సామాన్యుల పట్ల యమపాశాలవుతున్న సంగతి తెలిసిందే. తెలుగురాష్ట్రాల్లో యాప్​ల ద్వారా రుణాలు పొంది వాటిని కట్టలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో మరో ముగ్గురిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్​ చేశారు. బెంగళూరుకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 4 చరవాణుల స్వాధీనం చేసుకున్నారు.

ఆన్​లైన్​ రుణ యాప్​లో కేసులో తెలంగాణ సైబర్​క్రైమ్​ పోలీసులు ఇప్పటికే 20 మందిని అరెస్ట్​ చేశారు. ఇందులో కొంత మందిని ఇతర రాష్ట్రాలకు వెళ్లి అరెస్ట్​ చేసి.. వారిని పీటీ వారెంట్​ ద్వారా తెలంగాణకు తీసుకొచ్చారు. ప్రజలు లోన్‌ యాప్‌ల మాయలో పడొద్దని పోలీసులు సూచించారు. ఇంకా ఎవరైనా ఫోన్​ చేసి వేధిస్తుంటే తమకు ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పారు.

ఇదీ చదవండి: సీబీఐ విచారణ జరిపించకుంటే.. ఆధారాలు బయటపెడతాం: అయ్యన్నపాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.