ETV Bharat / city

లారీని ఢీ కొట్టిన బస్సు... ముగ్గురు ఏపీ వాసులు మృతి - bus accident updates

తెలంగాణలోని మిర్యాలగూడ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు... లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.

తెలంగాణలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు ఏపీ వాసులు మృతి

author img

By

Published : Aug 24, 2021, 5:58 AM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ఓ ట్రావెల్స్‌ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులు గాయపడగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ట్రావెల్స్‌ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. మృతులు రాష్ట్రానికి చెందిన నాగేశ్వరరావు (44), జయరావ్‌ (42), మల్లికార్జున్‌ (40)గా గుర్తించారు.

ఇదీ చూడండి:

crime news: రాహుల్ హత్య కేసు.. బెంగళూరులో పోలీసులకు చిక్కిన మరో నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.